యానిమేషన్‌ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ | SS Rajamouli plans RRR anime adaptation | Sakshi
Sakshi News home page

యానిమేషన్‌ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌

Feb 8 2026 4:09 AM | Updated on Feb 8 2026 4:09 AM

SS Rajamouli plans RRR anime adaptation

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్‌ దేవగణ్, ఒలీవియా మోరిస్‌ ఇతర పాత్రలుపోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 మార్చి 24న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటింది. ఈ సినిమాని యానిమేషన్‌ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రాజమౌళి.

ఇటీవల హాలీవుడ్‌ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి.. ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహబలి’  తరహాలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని యానిమేషన్‌ వెర్షన్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారాయన. ఈప్రాజెక్ట్‌ గురించి ప్రస్తుతం జపనీస్‌ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నారట. అన్నీ కుదిరితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యానిమేటెడ్‌ మూవీ త్వరలోనే ట్రాక్‌ ఎక్కే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement