ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి శనివారం క్లాప్ కొట్టారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ‘డీ 55’తో ఈ జోడీ రిపీట్ అవుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ మూవీ ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి ‘డీ 55’ రెండో సినిమా. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.


