లెజెండ్స్ ప్రొ టి20 లీగ్ ఆడనున్న మాజీ ఆటగాళ్లు
వచ్చే ఏడాది జనవరి 26 నుంచి టోర్నీ ప్రారంభం
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ సహా పలువురు దిగ్గజ ఆటగాళ్లు లెజెండ్స్ ప్రొ టి20 లీగ్ బరిలోకి దిగనున్నారు. గోవా వేదికగా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ లీగ్ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లతో పాటు పలువురు అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఈ లీగ్‌లో భాగస్వాములు కానున్నారు. దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఈ జాబితాలో ఉన్నారు. ఆ్రస్టేలియా మాజీ కెపె్టన్ మైకేల్ క్లార్క్ లీగ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అన్నీ జట్లలో కలిపి 90 మంది లెజండరీ ప్లేయర్లు పాల్గొననున్నారు. ‘క్రికెట్‌కు అతిపెద్ద నిలయంగా ఉన్న భారతదేశం నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచి్చంది. ఈ లీగ్‌లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడి అభిమానులకు ఆటపై అభిరుచి ఎక్కువ. ఈ లీగ్ ద్వారా పలువురు పాత మిత్రులతో పాటు, గతంలో హోరాహోరీగా తలపడిన ప్రత్యర్థులను తిరిగి కలిసే అవకాశం లభించనుంది. లెజెండ్స్ ప్రొ టి20 లీగ్‌లో కొత్త పాత్రలో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని క్లార్క్ పేర్కొన్నాడు.


