ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లో గట్టి ఝలక్ ఇచ్చింది. ముంబయి నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో నదినే డి క్లార్క్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కేవలం 44 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది.
కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, శ్రేయంకా పాటిల్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో ముంబయి క్రికెటర్ సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది. ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌తో రాణించింది.


