కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో 21–11తో సొంతం చేసుకుంది.
అనంతరం ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో సింధును విజేతగా ప్రకటించారు. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో యామగుచిపై సింధు ఆధిక్యం 15–12కు పెరిగింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో సింధు ఆడుతుంది.
ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 10–21, 21–23తో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాతి్వక్–చిరాగ్‌లకు 9,062 డాలర్ల (రూ. 8 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


