మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు ఓటమి పాలైంది. గాయం తర్వాత పునరాగమనం చేసిన సింధు సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడింది. కానీ సెమీస్‌లో మాత్రం చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 క్రీడాకారిణి వాంగ్ జియి నుంచి గట్టి పోటీ ఎదురైంది.
ఆమె చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓటమి చవిచూసింది. రెండో గేమ్‌లో సింధు 11-6తో ఆధిక్యంలో ఉన్నప్పటికి, వరుస తప్పిదాల వల్ల విజయాన్ని చేజార్చుకుంది. అంతకుముందు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ - ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీ చేతిలో 10-21, 21-23తో ఈ భారత అగ్రశ్రేణి ద్వయం ఓటమి పాలైంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో


