భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.
ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతడు సాధించిన స్కోర్‌లో 78 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం గమనార్హం.
అతడితో పాటు ఆరోన్ జార్జ్ 61 పరుగులతో రాణించారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం అభిజ్ఞాన్ కుండు(10), విహాన్ మల్హోత్రా(46) ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ అయూష్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మాత్రే కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా వార్మాప్ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లోనూ వైభవ్ అద్భుతాలు చేశాడు. రెండో వన్డేలో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేసిన వైభవ్.. మూడో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక వరల్డ్‌కప్ ప్రధాన టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్, అమెరికా జట్లు తలపడనున్నాయి.
చదవండి: WPL 2026: ఈ ఐదుగురు ప్లేయర్లపైనే కళ్లన్నీ.. గొంగడి త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?


