breaking news
India Under-19 team
-
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్‌లో భారత యువ జట్టు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన వైభవ్.. రెండో ఇన్నింగ్స్‌లో తన సహజ శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఈ ఇన్నింగ్స్‌లో 32 పరుగులకే ఔటయ్యాడు. మరో స్టార్ ప్లేయర్ చవ్డా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (93), కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. జాక్ హోమ్ (44), థామస్ రూ (34), జేడన్ డెన్లీ (27), జేమ్స్ మింటో (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.కుర్ర చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. వైభవ్ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో రాల్ఫీ ఆల్బర్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్ ఎనాన్ 23, హెనిల్ పటేల్ 38, దీపేశ్ దేవేంద్రన్ 4, అన్మోల్జీత్ సింగ్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రీన్, ఆల్బర్ట్ తలో 3 వికెట్లు తీయగా.. జాక్ హోమ్, ఆర్చీ వాన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్ మినహా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో చెలరేగిపోయాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.ఐదో వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. -
తండ్రికి తగ్గ తనయుడు.. టీమిండియాపై వీరోచిత పోరాటం! సెంచరీ మిస్
ఇంగ్లండ్ యువ సంచలనం, అండర్-19 ఆటగాడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడైన రాకీ.. బెకెన్హామ్ వేదికగా భారత అండర్-19తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాకీ ఫ్లింటాప్ తన వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించాడు. కెప్టెన్ హమ్జా షేక్ తో కలిసి అతను 154 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ దశలో సునాయసంగా తన సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన రాకీ.. 93 పరుగుల వద్ద దీపేష్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ యువ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజులో అల్బర్ట్(18),ఏకాన్ష్ సింగ్(59) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 202 పరుగుల వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో చెలరేగగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్ -
ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత అండర్–19 జట్టు శుభారంభం చేసింది. పుదుచ్చేరి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అండర్-19 జట్టు 49.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్ హోగన్ (42), రిలీ కింగ్సెల్ (36) రాణించారు. యువ భారత బౌలర్లలో మహమ్మద్ ఇనాన్ 4, కేపీ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన కార్తికేయ..అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని భారత యువ జట్టు 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో కేపీ కార్తికేయ (99 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ప్రదర్శన కనబరచగా.. అమాన్ (58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో పాటిర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అటు బంతితో, ఇటు బ్యాట్‌తో సత్తాచాటిన టీమిండియా ఆల్‌రౌండర్ కేపీ కార్తికేయకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య సోమవారం(సెప్టెంబర్ 23) రెండో మ్యాచ్ జరగనుంది. -
నేటి నుంచి కుర్రాళ్ల పోరు
కేప్‌టౌన్: క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు కుర్రాళ్లకు అవకాశం దక్కింది. నేటి నుంచి అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటేందుకు వారు సిద్ధమయ్యారు. మొత్తం 16 జట్లు తలపడే ఈ టోర్నీలో యువ భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఎలాగో కుర్రాళ్ల సంగ్రామంలో భారత్ అలాంటి జట్టు. ఎవరికీ సాధ్యం కానీ రీతిలో యువ జట్టు నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా నిలిచింది. ఇప్పుడు గ్రూప్–డిలో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో మరో టైటిల్ వేటకు సిద్ధమైంది. నేడు ఆతిథ్య దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’లో తొలి పోరు జరగనుండగా... 19న యువ భారత్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. వచ్చే నెల 9న జరిగే తుదిపోరుతో ఈ మెగా ఈవెంట్ ముగుస్తుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక దశలో ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్ లీగ్‌లో తలపడతాయి. ఇంకో దశలో తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేట్ లీగ్ పోటీలు జరుగుతాయి. అయితే సూపర్ లీగ్ జట్లు మాత్రమే టైటిల్ వేటలో ఉండగా... మిగతా జట్లు వర్గీకరణ పోటీల్లో తలపడతాయి. భారత అండర్–19 జట్టు: ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ, అథర్వ అంకోలెకర్, యశస్వి జైస్వాల్, కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్, దివ్యాన్‡్ష సక్సేనా, సిద్ధేశ్ వీర్, ఆకాశ్ సింగ్, శుభాంగ్ హెగ్డే, ధ్రువ్ జురెల్, కుశాగ్ర కుమార్, విద్యాధర్ పాటిల్, శాశ్వత్ రావత్, దివ్యాన్‡్ష జోషి. యువ భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ (వేదిక బ్లూమ్ఫొంటెన్ ) జనవరి 19 భారత్–శ్రీలంక జనవరి 21 భారత్–జపాన్ జనవరి 24 భారత్–న్యూజిలాండ్. -
విజేత యువ భారత్
డర్బన్: ప్రపంచకప్‌కు ముందు భారత యువ జట్టు తమ సత్తాను ప్రదర్శిస్తూ నాలుగు దేశాల అండర్–19 వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఆరంభంలో గెరాల్డ్ కోయిజే (3/19) విజృంభించడంతో... యశస్వి జైస్వాల్ (0), దివ్యాన్‡్ష సక్సేనా (6), సారథి ప్రియమ్ గార్గ్ (2) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్ 13 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ట్రోఫీతో హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్‌వర్మ ఈ దశలో జట్టు బాధ్యతను తిలక్ వర్మ (103 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్), ధ్రువ్ జురెల్ (115 బంతుల్లో 101; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో సిద్ధేశ్ వీర్ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది. ఛేదన ప్రారంభించిన దక్షిణాఫ్రికాను అథర్వ అన్కోలేకర్ (4/31) హడలెత్తించడంతో... ఆ జట్టు 43.1 ఓవర్లలో 190 పరుగులకే చాప చుట్టేసింది. జాక్ లీస్ (52; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ రాణించిన తిలక్ వర్మ కీలకమైన ఓపెనర్ ఆండ్రూ లోవ్ (17; 3 ఫోర్లు) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ధ్రువ్ జురెల్ అవార్డు అందుకోగా... టోర్నీ మొత్తం రాణించిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. -
భారత కుర్రాళ్ల క్లీన్‌స్వీప్
టాంటన్: అన్ని విభాగాల్లో రాణించిన భారత అండర్–19 జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత కుర్రాళ్ల జట్టు ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాహుల్ చహల్ నాలుగు, అభిషేక్ శర్మ 3 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ పృథ్వీ షా (45 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్స్), హర్వీక్ దేశాయ్ (44; 4 ఫోర్లు, ఒక సిక్స్), కమలేశ్ నాగర్కోటి (26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. -
ఇంగ్లండ్ 311/1
నాగ్‌పూర్: భారత్ అండర్–19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఇంగ్లండ్ అండర్–19 జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు మ్యాక్స్ హోడ్లెన్ (135 బ్యాటింగ్; 17 ఫోర్లు), జార్జి బార్ట్లెట్ (132 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో సోమవారం ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో వికెట్ నష్టానికి 311 పరుగులు చేసింది. -
భారత అండర్-19 జట్టు నుంచి చందన్ సహాని ఔట్
వయస్సు పైబడిన ఏడుగురు క్రికెటర్లపై బీసీసీఐ వేటు ముంబై: ఆసియా కప్ కోసం లోగడ ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు నుంచి హైదరాబాద్ క్రికెటర్ చందన్ సహానిని తప్పించారు. వయస్సు పైబడటంతో ఇతనితో పాటు మొత్తం ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేశారు. దిగ్విజయ్ రంగీ, డారిల్ ఫెర్రారియో, సందీప్ తోమర్, రిషబ్ భగత్, సిమర్జిత్ సింగ్, ఇజాన్ సయ్యద్‌లను తప్పించి కొత్తగా హిమాన్షు రాణా, సల్మాన్ ఖాన్, హర్విక్ దేశాయ్, యశ్ ఠాకూర్, హెరాంబ్ పరాబ్, వివేకానంద్ తివారి, హేత్ పటేల్‌లను భారత జూనియర్ జట్టుకు ఎంపిక చేశారు. తప్పించిన ఆ ఏడుగురు క్రికెటర్లు నవంబర్ 1998కు ముందు జన్మించారు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అనర్హులనీ తేల్చి వయస్సు నిబంధనలపై బీసీసీఐకి స్పష్టతనిచ్చింది. ఇందులో ఎవరికైతే వచ్చే అండర్-19 ప్రపంచకప్ (న్యూజిలాండ్) నాటికి 19 ఏళ్లలోపు వయస్సుంటుందో వారే అర్హులని తెలిపింది. దీంతో కొత్తగా అర్హులైన ఏడుగురు ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఆసియా కప్ అండర్-19 టోర్నీ ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీలంకలో జరుగుతుంది.