జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 18–21, 20–22తో ప్రపంచ 44వ ర్యాంకర్ పానిత్‌చపోన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, లక్ష్య సేన్‌లకు మూడు వేల డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ, 5,040 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


