ముగిసిన నిరీక్షణ.. భార‌త్‌ను వీడ‌నున్న సౌతాఫ్రికా, విండీస్ జ‌ట్లు | Stuck West Indies and South Africa teams to leave India on Tuesday | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ముగిసిన నిరీక్షణ.. భార‌త్‌ను వీడ‌నున్న సౌతాఫ్రికా, విండీస్ జ‌ట్లు

Mar 10 2026 7:54 AM | Updated on Mar 10 2026 7:54 AM

 Stuck West Indies and South Africa teams to leave India on Tuesday

భారత్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు వచ్చింది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఎట్టకేలకు స్వదేశాలకు పయనం అవుతున్నాయి. టీమిండియా నెగ్గిన ఈ మెగా ఈవెంట్‌లో కరీబియన్‌ సూపర్‌–8లోనే నిష్క్ర‌మించింది. దక్షిణాఫ్రికా సెమీస్‌ ఓడింది. సూపర్‌–8 మ్యాచ్‌లు ముగిసి వారం రోజులవుతున్నా... పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో విదేశీ జట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో మొదలైన కుంపటి పశ్చిమాసియాకు పాకింది. తమపై యుద్ధం చేస్తున్న అమెరికా స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియా గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో కరీబియన్‌ జట్టు చిక్కుకుంది. 

కొందరు ఐపీఎల్‌ కోసం ఉండిపోగా, మరికొందరు ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో చుట్టూ తిరిగి విండీస్‌ దీవులకు చేరుకోనున్నారు. మిగిలిపోయిన 12 మంది విండీస్‌ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దక్షిణాఫ్రికా జట్టు సభ్యులతో కలిసి జొహన్నెస్‌బర్గ్‌ మీదుగా అంటిగ్వా చేరుకోనుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement