ప్రిక్వార్టర్ ఫైనల్లోకి భారత స్టార్ షట్లర్
గాయత్రి–ట్రెసా జోడీకి చుక్కెదురు
కౌలాలంపూర్: గాయం నుంచి కోలుకొని కొత్త సీజన్‌లో తొలి టోర్నీ ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గెలుపు బోణీ చేసింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 22–20తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.
51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ షట్లర్ ఆ తర్వాత తేరుకోవడం గమనార్హం. తొలి గేమ్‌లో 6–9తో వెనుకబడ్డ దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో 3–5తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత కోలుకొని 15–11తో ఆధిక్యంలోకి వచి్చంది.
ఈ తరుణంలో సుంగ్ షువో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 15–15తో సమం చేసింది. ఆ తర్వాత స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజాకి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు.
సాత్విక్–చిరాగ్ జంట శుభారంభం
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేయగా... హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. సాత్విక్–చిరాగ్ జంట 21–13, 21–15తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. హరిహరన్–అర్జున్ జంట 10–21, 20–22తో హిరోకి మిదోరికావా–క్యొహీ యామíÙటా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.
మహిళల డబుల్స్‌లో భారత జోడీల కథ ముగిసింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... కవిప్రియ సెల్వం–సిమ్రన్... రుతుపర్ణ–శ్వేతాపర్ణ పాండా జోడీలు తొలి రౌండ్‌లోనే ని్రష్కమించాయి. గాయత్రి–ట్రెసా 9–21, 23–21, 19–21తో ఫెబ్రియానా కుసుమ–మెలీసా (ఇండోనేసియా) చేతిలో... కవిప్రియ–సిమ్రన్ 12–21, 11–21తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమోతో (జపాన్) చేతిలో... రుతుపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 9–21తో టాన్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
రుత్విక–రోహన్ జోడీ అవుట్
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ భారత జోడీల పోరాటం ముగిసింది. తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... అమృత–అశిత్ సూర్య... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంటలు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాయి. రుత్విక–రోహన్ 10–21, 17–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) చేతిలో... అమృత–అశిత్ 11–21, 9–21తో ఫువానత్–బెన్‌యాప (థాయ్‌లాండ్) చేతిలో... తనీషా–ధ్రువ్ 15–21, 21–18, 15–21తో ప్రెస్లీ–జెనీ గాయ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు.


