breaking news
Malaysia Open Super Series
-
క్వార్టర్స్‌లో సింధు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–8, 21–13తో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజకి (జపాన్)పై గెలిచింది. కేవలం 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–12తో ఆధిక్యంలో ఉంది. లక్ష్య సేన్, ఆయుశ్ అవుట్ పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 20–22, 15–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో... ప్రపంచ 32వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 18–21, 21–18, 12–21తో ప్రపంచ నంబర్‌వన్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్–చిరాగ్ ద్వయం 21–18, 21–11తో జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా)లతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. -
సింధు శ్రమించి...
కౌలాలంపూర్: గాయం నుంచి కోలుకొని కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గెలుపు బోణీ చేసింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 22–20తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ షట్లర్ ఆ తర్వాత తేరుకోవడం గమనార్హం. తొలి గేమ్‌లో 6–9తో వెనుకబడ్డ దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో 3–5తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత కోలుకొని 15–11తో ఆధిక్యంలోకి వచి్చంది. ఈ తరుణంలో సుంగ్ షువో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 15–15తో సమం చేసింది. ఆ తర్వాత స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజాకి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు. సాత్విక్–చిరాగ్ జంట శుభారంభం పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేయగా... హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. సాత్విక్–చిరాగ్ జంట 21–13, 21–15తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. హరిహరన్–అర్జున్ జంట 10–21, 20–22తో హిరోకి మిదోరికావా–క్యొహీ యామíÙటా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో భారత జోడీల కథ ముగిసింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... కవిప్రియ సెల్వం–సిమ్రన్... రుతుపర్ణ–శ్వేతాపర్ణ పాండా జోడీలు తొలి రౌండ్లోనే ని్రష్కమించాయి. గాయత్రి–ట్రెసా 9–21, 23–21, 19–21తో ఫెబ్రియానా కుసుమ–మెలీసా (ఇండోనేసియా) చేతిలో... కవిప్రియ–సిమ్రన్ 12–21, 11–21తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమోతో (జపాన్) చేతిలో... రుతుపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 9–21తో టాన్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. రుత్విక–రోహన్ జోడీ అవుట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ భారత జోడీల పోరాటం ముగిసింది. తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... అమృత–అశిత్ సూర్య... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంటలు తొలి రౌండ్లోనే వెనుదిరిగాయి. రుత్విక–రోహన్ 10–21, 17–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) చేతిలో... అమృత–అశిత్ 11–21, 9–21తో ఫువానత్–బెన్యాప (థాయ్‌లాండ్) చేతిలో... తనీషా–ధ్రువ్ 15–21, 21–18, 15–21తో ప్రెస్లీ–జెనీ గాయ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
కొత్త సీజన్లో కోటి ఆశలతో...
కౌలాలంపూర్: కొత్త ఏడాది కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భారత షట్లర్లంతా మలేసియా ఓపెన్‌కు సై అంటున్నారు. అనుభవజు్ఞలైన స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ సహా భారత బలగమంతా ఈ టోర్నీ బరిలోకి దిగుతోంది. 14,50,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13.09 కోట్లు) గల ఈ సూపర్–1000 టోర్నమెంట్‌ను ఆశావహ దృక్పథంతో ప్రారంభించాలని భారత షట్లర్లు భావిస్తున్నారు. 2025 సీజన్ భారత బ్యాడ్మింటన్‌కు ఓ చేదుగుళికగా ముగిసింది. స్టార్ ఆటగాళ్ల గాయాలు, నిలకడలేని ఆటతీరు, ప్రధాన టోర్నీలో చెత్త ప్రదర్శన ఇలా చెప్పుకుంటూ పోతే నిరుత్సాహకరంగానే గతేడాది ముగిసింది. దీనిని సాధ్యమైనంత తొందరగా మర్చిపోయి మలేసియా ఓపెన్‌లో మంచి రోజులను తెచ్చుకోవాలని... తద్వారా వచ్చే వారం సొంతగడ్డ (ఢిల్లీ)పై జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాలని షట్లర్లంతా ఆశిస్తున్నారు. జియా హెంగ్‌తో లక్ష్య పోరు సింగిల్స్‌లో లక్ష్యసేన్ గుడ్డికంటే మెల్ల నయం అన్నచందంగా ఒకటి అర టోర్నీలో మెరిశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ గెలిచాడు. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరాడు. ఇప్పుడు తాజా టోర్నీ సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్‌తో 24 ఏళ్ల స్టార్ షట్లర్ ఈ సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్ సూపర్–300 టైటిల్ గెలిచిన యువతార ఆయుశ్ షెట్టి ఈ సీజన్లో ప్రతీ టోర్నీలోనూ నిలకడైన ప్రదర్శన కనబరచడమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇతనికి క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవుతున్నాడు. తొలి రౌండ్లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ జి జియా (మలేసియా)తో ఆయుశ్ పోటీపడతాడు. గంపెడాశలతో సింధు మహిళల సింగిల్స్‌లో రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు ఈ సీజన్‌పై గంపెడాశలు పెట్టుకుంది. గాయాల బెడదతోనే గడిచిన గత సీజన్‌ను మరిపించేలా ఈ ఏడాది తన ప్రదర్శన ఉండాలని గట్టి పట్టుదలతో ఉంది. తొలి పోరులో భారత స్టార్ షట్లర్ సింధు... చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యున్‌తో తలపడుతుంది. అయితే ఉన్నతి హుడాకు తొలి రౌండ్లో చైనా గోడ ఎదురవుతోంది. ఆమె టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ యు ఫె (చైనా)ను ఢీకొట్టనుంది. మోకాలి గాయంతో ఆరు నెలలు పూర్తిగా ఆటకు దూరంగా ఉన్న మాళవిక బన్సోద్... మాజీ ప్రపంచ చాంపియన్, ఏడో సీడ్ రచనొక్ ఇంతనొన్ (థాయ్‌లాండ్)తో సీజన్‌ను ప్రారంభించనుంది. సాత్విక్–చిరాగ్‌ల జోరు కొనసాగేనా... గత ఏడాది ఓవరాల్‌గా భారత బ్యాడ్మింటన్‌లోనే అత్యంత మెరుగ్గా, ధీటుగా రాణించిన ఆటగాళ్లెవరైనా ఉంటే సాత్విక్–చిరాగ్లే! పెద్దగా కలిసిరాని 2025లో కూడా తమ ఉనికి చాటుకొని జోరు సాగించిన జోడీ... ఇప్పుడు ఇదే ఉత్సాహంతో 2026ను ఘనంగా మొదలుపెట్టాలని అనుకుంటుంది. గత నెల ముగిసిన వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సెమీస్ దాకా పోరాడిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ... హాంకాంగ్ ఓపెన్, చైనా మాస్టర్స్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరెన్నో టోర్నీలో సెమీస్ చేరింది. తాజా టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం... లీ జె హుయ్–యంగ్ పొ సున్ (చైనీస్ తైపీ) జంటతో తొలి రౌండ్లో తలపడుతుంది. మరో డబుల్స్ జోడీ ఎమ్.ఆర్. అర్జున్–హరిహరన్.... హిరొకి మిడొరికవా–క్యోహి యమషిత (జపాన్) జంటతో పోటీపడుతుంది. కొత్త ఉత్సాహంతో గాయత్రి–ట్రెసా మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ నూతనోత్సాహంతో మలేసియా టోర్నీలో దిగుతోంది. గత ఏడాది గాయత్రి భుజం గాయంతో ఇబ్బంది పడింది. ఇటీవల ట్రెసాతో కలిసి సయ్యద్ మోడి టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవడం ద్వారా రేసులోకి వచ్చారు. ఈ టోర్నీ తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జోడీ ఇండోనేసియాకు చెందిన ఫెబ్రియానా ద్విపుజి కుసుమ–మెలిసా ట్రియాస్ పుస్పిటసరి జంటతో తలపడనుంది. -
సింధు పునరాగమనం
కౌలాలంపూర్: గాయంతో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీతో 2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక ... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ పోటీపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్‌లో చివరిసారి బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆ తర్వాత చీలమండ గాయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు ఇతర టోర్నీలకు ఆమె దూరంగా ఉంది. సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో కెంటా నిషిమోటో (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 10 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 87,500 డాలర్ల చొప్పున (రూ. 72 లక్షలు) అందజేస్తారు. -
తొలిరౌండ్లోనే సైనా, సింధు ఓటమి
కుచింగ్: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. అజయ్ జయరామ్ మినహా... మిగతావారంతా తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–18, 19–21, 17–21తో అన్‌సీడెడ్ చెన్ యుఫీ (చైనా) చేతిలో... సైనా నెహ్వాల్ 21–19, 13–21, 15–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయారు. సింధు, సైనా తొలి గేమ్‌లో నెగ్గినప్పటికీ... ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 21–11, 21–8తో కియో బిన్ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... సాయిప్రణీత్ 21–18, 19–21, 18–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–18, 18–21, 17–21తో లియో కువాన్ హో–లు చియా పిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 19–21, 21–19, 21–23తో కిమ్ అస్ట్రుప్–జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యాయి. -
‘మలేసియా’పై సైనా, శ్రీకాంత్ గురి
కౌలాలంపూర్: స్వదేశంలో ‘సూపర్’ విజయాన్ని సాధించిన జోరులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మరో ‘సూపర్ సిరీస్’ టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ ఇద్దరిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తొలి రోజున క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ‘ఇండియా ఓపెన్’ టైటిల్స్ నెగ్గిన తర్వాత ఆదివారం రాత్రే వీరిద్దరూ మలేసియాకు బయలుదేరి వెళ్లారు. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37,500 డాలర్ల చొప్పున లభిస్తాయి. బుధవారం జరిగే తొలి రౌండ్లో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; మరియా ఫెబి కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సైనా తలపడతారు. వీరిద్దరితోపాటు కశ్యప్, ప్రణయ్, గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


