కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–8, 21–13తో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజకి (జపాన్)పై గెలిచింది. కేవలం 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–12తో ఆధిక్యంలో ఉంది.
లక్ష్య సేన్, ఆయుశ్ అవుట్
పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 20–22, 15–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో... ప్రపంచ 32వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 18–21, 21–18, 12–21తో ప్రపంచ నంబర్‌వన్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్–చిరాగ్ ద్వయం 21–18, 21–11తో జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా)లతో
సాతి్వక్–చిరాగ్ తలపడతారు.


