పావురాల రెట్టలు.. పరువు పోయాక చర్యలు | After India Open Debacle Sports Ministry Pushes SAI For Action | Sakshi
Sakshi News home page

పావురాల రెట్టలు.. పరువు పోయాక చర్యలు

Jan 21 2026 11:39 AM | Updated on Jan 21 2026 11:50 AM

After India Open Debacle Sports Ministry Pushes SAI For Action

దిద్దుబాటు చర్యలు చేపట్టిన క్రీడాశాఖ

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ నిర్వహణ లోపాలపై కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని క్రీడాశాఖ నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇలాంటి నిర్వాకం చేటు
ఇండియా ఓపెన్‌ వేదిక ఇందిరాగాంధీ స్టేడియం అధికారులను పిలిచిన క్రీడాశాఖ... నిర్వహణ తీరు, తలెత్తిన గందరగోళానికి సంబంధించిన సమగ్ర నివేదిక కోరింది. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం బిడ్డింగ్‌ రేసులో నిలవాలనుకుంటున్న భారత్‌కు ఇలాంటి నిర్వాకం చేటు చేస్తుందని క్రీడాశాఖ భావించింది. 

కఠిన చర్యలు తీసుకోండి
అందుకే సత్వర చర్యలు తీసుకునేందుకు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు, ఆతిథ్య వైఫల్యం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాండవీయ ‘సాయ్‌’ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

నిజానికి ఇండియా ఓపెన్‌ భారత బ్యాడ్మింటన్‌ సంఘం నిర్వహించినప్పటికీ దేశంలోని ప్రముఖ క్రీడా స్టేడియాలు, ఎక్సలెన్సీ సెంటర్లన్నీ ‘సాయ్‌’ పరిధిలోనివి. వీటి నిర్వహణ కోసం కేంద్రం ప్రతీ ఏటా క్రీడా బడ్జెట్లో నిధులు కూడా ఇస్తోంది.

అసలేం జరిగింది? 
దేశ రాజధానిలో ఇండియా ఓపెన్‌ జరిగింది. త్వరలోనే ఇక్కడ ప్రపంచ చాంపియన్‌షిప్‌  కూడా జరగనుంది. అయితే ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని, ఆడే పరిస్థితులు లేవని, ప్రాక్టీస్‌ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శించింది

ఆమె విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్‌లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేశాయి. దీంతో నిర్వహణ తీరు, ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్‌ ఓవరాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement