ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన ముంబైని బ్యాటింగ్‌కు అహ్హనించింది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు.
ముంబై జట్టు 11 ఓవర్లలో 67 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది.
ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, శ్రేయంకా పాటిల్ తలా వికెట్ సాధించారు.
అయితే ముంబై ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సజన రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచే తప్పించుకుంది. రెండు సునాయస క్యాచ్‌లను ఆర్సీబీ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ


