NZ vs SL: సూపర్‌-8 మ్యాచ్‌.. లైన్‌ క్లియర్‌! | T20 WC NZ vs SL: Sri Lanka Won Toss Playing XIs Of Both Teams | Sakshi
Sakshi News home page

NZ vs SL: సూపర్‌-8 మ్యాచ్‌.. లైన్‌ క్లియర్‌!

Feb 25 2026 6:49 PM | Updated on Feb 25 2026 7:13 PM

T20 WC NZ vs SL: Sri Lanka Won Toss Playing XIs Of Both Teams

న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లకు శుభవార్త. ఇరుజట్ల మధ్య సూపర్‌-8 మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సూపర్‌-8 దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో కివీస్‌-లంక తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇరజట్ల అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి.

అయితే, కొలంబోలో ప్రస్తుతం వర్ష సూచన లేదు. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ కాగా.. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక కివీస్‌తో మ్యాచ్‌లో లంక తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. 

ఒక మార్పుతో బరిలోకి
కమాల్‌ మిశారా స్థానంలో చరిత్‌ అసలంకకు అవకాశం ఇచ్చింది. టాపార్డర్‌ను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్‌ దసున్‌ షనక వెల్లడించాడు. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

మా జట్టులోనూ ఓ మార్పు
మరోవైపు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మాట్లాడుతూ.. శ్రీలంకతో మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు వెల్లడించాడు. లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలిపాడు. జిమ్మీ నీషమ్‌ స్థానంలో కోల్ మెకాంచీ తుదిజట్టులోకి వచ్చినట్లు సాంట్నర్‌ తెలిపాడు. మధ్య ఓవర్లలో అదనపు స్పిన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

తుదిజట్లు
శ్రీలంక
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

న్యూజిలాండ్‌
టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement