బెంగళూరు: ఆంధ్ర జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి పోరాడినా ఓటమి తప్పలేదు. విజయ్ హజారే వన్డే టోరీ్నలో గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర చివరకు 7 పరుగుల స్వల్ప తేడాతో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. భారత ఆల్‌రౌండర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (111 బంతుల్లో 130; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) గుజరాత్‌ను గెలిపించాడు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీస్కోరు చేసింది. ఒక దశలో గుజరాత్ స్కోరు 29/3 కాగా...అక్షర్ జట్టును ఆదుకున్నాడు. అక్షర్, విశాల్ జైస్వాల్ (60 బంతుల్లో 70; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆరో వికెట్‌కు 142 పరుగులు జత చేశారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టగా, నితీశ్‌కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ (125 బంతుల్లో 102; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో ఆంధ్రను చివరి దాకా రేసులో నిలిపాడు.
అయితే ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేయగలిగింది. శ్రీకర్ భరత్ (39; 6 ఫోర్లు, 1 సిక్స్), ధనుశ్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా...ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఐదు మ్యాచ్‌లాడిన ఆంధ్రకిది నాలుగో పరాజయం! ఇదే వేదికపై మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో హరియాణాతో ఆంధ్ర తలపడుతుంది.


