ఇంగ్లండ్‌ ‘క్లీన్‌స్వీప్‌’ | England clean sweep | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ‘క్లీన్‌స్వీప్‌’

Feb 4 2026 7:23 AM | Updated on Feb 4 2026 11:50 AM

England clean sweep

పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్‌ జట్టు... శ్రీలంకపై టి20 సిరీస్‌ను ‘క్లీన్‌ స్వీప్‌’ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్‌ 12 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌... టి20 సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. 

సామ్‌ కరన్‌ (48 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో రాణించగా... జోస్‌ బట్లర్‌ (25), లియామ్‌ డాసన్‌ (14) మాత్రమే రెండంకెల స్కరు చేశారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (4), బెన్‌ డకెట్‌ (0), జాకబ్‌ బెథెల్‌ (3), టామ్‌ బాంటన్‌ (7), విల్‌ జాక్స్‌ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... పతిరణకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో లంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (23), కుషాల్‌ మెండిస్‌ (26) కాస్తా పోరాడగా... తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెథెల్‌ 4, జాక్స్‌ 3 వికెట్లు పడగొట్టారు. సామ్‌ కరన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.    

Advertisement
 
Advertisement
Advertisement