శ్రీలంకకు ఊహించని షాక్‌ | Sri Lanka to head into T20 World Cup without SRH stars services | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: శ్రీలంకకు ఊహించని షాక్‌

Feb 2 2026 9:22 PM | Updated on Feb 2 2026 9:22 PM

Sri Lanka to head into T20 World Cup without SRH stars services

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20‍లో మలింగ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.

అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి 4 నుండి 6 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మలింగ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టు తరపున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.

ఈ క్రమంలోనే అతడికి వరల్డ్‌కప్‌ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుహ్యంగా గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడి స్ధానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.

టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్‌ తీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement