భారత తుది జట్టు ఇదే.. స్టార్‌ ప్లేయర్‌కు నో ఛాన్స్‌? | Parthiv Patel predicts Indias playing 11 for T20 World Cup 2026, | Sakshi
Sakshi News home page

T20 WC 2026: భారత తుది జట్టు ఇదే.. స్టార్‌ ప్లేయర్‌కు నో ఛాన్స్‌?

Feb 2 2026 5:30 PM | Updated on Feb 2 2026 5:52 PM

Parthiv Patel predicts Indias playing 11 for T20 World Cup 2026,

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి శ్రీలంక‌, భార‌త్ వేదిక‌ల‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగ‌నుంది. ఈసారి కూడా ఎలాగైనా గెలిచి టైటిల్‌ను రిటైన్ చేసుకోవాల‌ని మెన్ ఇన్ బ్లూ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఈ టోర్నీలో భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 7న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా యూఎస్ఎతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కోసం భార‌త తుది జ‌ట్టును టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ పార్ధివ్ ప‌టేల్ అంచనా వేశాడు. ఓపెన‌ర్లుగా అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌కు అత‌డు అవ‌కాశ‌మిచ్చాడు. 

సంజూ శాంస‌న్ పేల‌వ ఫామ్ క‌న‌బ‌రుస్తుండ‌డంతో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా ఇషాన్ వైపే పార్ధివ్ మొగ్గు చూపాడు. కివీస్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంస‌న్ కేవ‌లం 46 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు మూడో స్దానంలో, గాయం నుంచి కోలుకున్న తిల‌క్ వ‌ర్మ‌కు నాలుగో స్ధానంలో ప‌టేల్ ఛాన్స్ ఇచ్చాడు. 

పార్ధివ్ ఎంపిక చేసిన జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ల‌గా శివం దూబే,హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ చోటు ద‌క్కించుకున్నాడు. ఫినిష‌ర్‌గా రింకూ సింగ్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌ను పార్ధివ్ ఎంపిక చేశాడు. యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణాకు మాత్రం అత‌డు ఎంపిక చేసిన జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఈ జ‌ట్టులో స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి అవ‌కాశం ల‌భించింది.

పార్ధివ్ ప‌టేల్ ఎంపిక చేసిన ఇండియ‌న్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌
అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబే ,హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి

Advertisement
 
Advertisement
Advertisement