క్వార్టర్స్‌లో తాన్వి, మాళవిక | Tanvi Sharma has entered the quarter finals of the Orleans Masters Badminton Tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో తాన్వి, మాళవిక

Mar 20 2026 1:58 AM | Updated on Mar 20 2026 1:58 AM

Tanvi Sharma has entered the quarter finals of the Orleans Masters Badminton Tournament

ఓర్లియాన్స్‌ (ఫ్రాన్స్‌): ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్‌ తాన్వి శర్మ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో తాన్వి   21–14, 21–17తో భారత్‌కే చెందిన అన్‌మోల్‌ ఖర్బ్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌లలో ఇషారాణి బారువా 21–11, 14–21, 21–17తో వెన్‌ యు జాంగ్‌ (కెనడా)పై, మాళవిక బన్సోద్‌ 24–22, 21–13తో వాంగ్‌ లింగ్‌ చింగ్‌ (మలేసియా)పై, నెగ్గి ముందంజ వేశారు. 

పురుషుల డబుల్స్‌లో భారత జోడి హరిహరన్‌ – ఎంఆర్‌ అర్జున్‌ 26–24, 21–14తో అలెగ్డాండర్‌ డున్‌ – ఆడమ్‌ ప్రింగిల్‌ (స్కాట్లాండ్‌)ని ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో 21–9, 18–21, 9–21 స్కోరుతో యుడై ఒకొమొటో (జపాన్‌) చేతిలో ఓటమితో ఆయుశ్‌ శెట్టి (భారత్‌), మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జంట గద్దె రుత్విక శివాని – రోహన్‌ కపూర్‌ 21–19, 9–21, 14–21తో  టాప్‌ సీడ్‌ థామ్‌ గిక్వెల్‌ – డెల్‌ఫైన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడి నిష్క్రమించారు.

Advertisement
 
Advertisement
Advertisement