జోస్ బ‌ట్ల‌ర్ రిటైర్మెంట్‌..? | Is Jos Buttler retiring after horrible T20 World Cup 2026? | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జోస్ బ‌ట్ల‌ర్ రిటైర్మెంట్‌..?

Mar 19 2026 10:57 AM | Updated on Mar 19 2026 1:06 PM

Is Jos Buttler retiring after horrible T20 World Cup 2026?

జోస్ బ‌ట్ల‌ర్.. ప్ర‌స్తుత త‌రం అత్యుత్త‌మ క్రికెట‌ర్ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్ ఇటీవ‌ల ముగిసిన టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో మాత్రం దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బ‌ట్ల‌ర్ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు.

మొత్తం 8 మ్యాచ్‌ల‌లో అత‌డు కేవ‌లం 87 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా క‌నీసం 30 ప‌రుగులు సాధించ‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలో బ‌ట్ల‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌కునున్న‌ట్లు ప్రాచారం జ‌రిగింది. తాజాగా త‌న రిటైర్మెంట్ వార్త‌ల‌పై బ‌ట్ల‌ర్ స్పందించాడు. 

ఇప్ప‌టిలో త‌న‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించే ఆలోచ‌న లేద‌ని బ‌ట్ల‌ర్ స్ప‌ష్టం చేశాడు. బ‌ట్ల‌ర్ ఇటీవ‌ల ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్నాడు. ఈ సంద‌ర్భంగా ఇంగ్లండ్ తదుప‌రి వైట్‌-బాల్ సిరీస్‌లో ఆడ‌తారా? అన్న ప్ర‌శ్న జోస్‌కు ఎదురైంది.

"ఇంగ్లండ్ త‌దుప‌రి సిరీస్‌లో ఆడాల‌నుకుంటున్నాను. నిజంగానే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాను. ఇలా ఆడుతాన‌ని అస్స‌లు ఊహించ‌లేదు. అది తీవ్ర‌ నిరాశ క‌లిగించింది. అయితే  గత కొన్నేళ్లుగా నా కెరీర్‌లోనే అత్యుత్తమ క్రికెట్ ఆడాను. 

త్వ‌ర‌లోనే తిరిగి ఫామ్‌లోకి వ‌స్తాన‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. ఇంగ్లండ్ త‌ర‌పున మ‌రి కొంత కాలం ఆడాల‌నుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు కెప్టెన్‌ని కాను కేవ‌లం ప్లేయ‌ర్‌ మాత్ర‌మే. జ‌ట్టులో కొన‌సాగ‌డం లేక‌పోవ‌డం అనేది సెలెక్టర్ల చేతుల్లో ఉంటుంది. 

ఏమి జ‌రుగుతుందో చూద్దాం. ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ఫ్యామిలీతో గ‌డిపిన స‌మ‌యం నాకు ఉప‌శ‌మనం క‌లిగించింది" అని బ‌ట్ల‌ర్ పేర్కొన్నాడు. కాగా వ‌ర‌ల్డ్‌క‌ప్ వైఫ‌ల్యం త‌ర్వాత బ‌ట్ల‌ర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి ఫ్రాన్స్ ట్రిప్‌న‌కు వెళ్లాడు. అత‌డు ఒక‌ట్రెండు రోజుల్లో ఐపీఎల్‌-2026 సీజ‌న్ కోసం భార‌త్‌కు రానున్నాడు. గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున బ‌ట్ల‌ర్ బ‌రిలోకి దిగ‌నున్నాడు.
చదవండి: సీఎస్‌కే వైస్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు: అనిల్‌ కుంబ్లే

Advertisement
 
Advertisement
Advertisement