మళ్లీ ఢిల్లీనే... | Delhi Capitals win | Sakshi
Sakshi News home page

మళ్లీ ఢిల్లీనే...

Feb 3 2026 10:41 PM | Updated on Feb 4 2026 3:55 AM

Delhi Capitals win

వరుసగా నాలుగోసారి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోకి క్యాపిటల్స్‌

‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో 7 వికెట్లతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపు

బంతితో మెరిసిన హెన్రీ, నందిని 

బ్యాట్‌తో దంచేసిన లిజెల్లీ లీ

రేపు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఢిల్లీ టైటిల్‌ పోరు  

వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ ఫైనల్‌ చేరింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌ చేరిన జట్టుగా ఢిల్లీ ఘనత వహించింది. గురువారం జరిగే టైటిల్‌ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో క్యాపిటల్స్‌ తలపడుతుంది. 2024లోనూ ఇరు జట్లు టైటిల్‌ కోసం ఢీకొనగా ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. 

మొదట గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, జార్జియా వేర్‌హమ్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌ (0), కెప్టెన్‌ యాష్లీ గార్డ్‌నర్‌ (0) విఫలమయ్యారు. చినెల్లి హెన్రీ 3 వికెట్లు, నందిని శర్మ 2 వికెట్లు తీశారు. 

అనంతరం ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లీ లీ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేశారు. షఫాలీ వర్మ (21 బంతుల్లో 31; 7 ఫోర్లు), లౌరా వోల్‌వార్డ్‌ (24 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. వేర్‌హమ్‌కు 2 వికెట్లు దక్కాయి.

స్కోరు వివరాలు
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (నాటౌట్‌) 62; సోఫీ డివైన్‌ (సి) లిజెల్లీ (బి) హెన్రీ 6; అనుష్క (సి) హెన్రీ (బి) నందిని 16; యాష్లీ గార్డ్‌నర్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) నందిని 0; కనిక (స్టంప్డ్‌) లిజెల్లీ (బి) మిన్ను మణి 6; వేర్‌హమ్‌ (సి) వోల్‌వార్డ్‌ (బి) హెన్రీ 35; భారతి (సి అండ్‌ బి) హెన్రీ 0; కాశ్వీ గౌతమ్‌ (రనౌట్‌) 18; తనూజ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–38, 4–59, 5–120, 6–125, 7–164. బౌలింగ్‌: మరిజాన్‌ కాప్‌ 4–0–32–0, చినెల్లీ హెన్రీ 4–0–35–3, నందిని శర్మ 4–0–44–2, మిన్ను మణి 4–0–23–1, స్నేహ్‌ రాణా 1–0–3–0, శ్రీచరణి 3–0–25–0. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లిజెల్లీ లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్‌హమ్‌ 43; షఫాలీ వర్మ (బి) వేర్‌హమ్‌ 31; వోల్‌వార్డ్‌ (నాటౌట్‌) 32; జెమీమా (సి) సోఫీ (బి) రాజేశ్వరి 41; మరిజాన్‌ కాప్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–89, 2–92, 3–160. బౌలింగ్‌: రేణుక 2–0–27–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–17–0, రాజేశ్వరి 3–0–33–1, సోఫీ డివైన్‌ 3–0–35–0, జార్జియా వేర్‌హమ్‌ 3.4–0–28–2, తనూజ 1–0–5–0, యాష్లీ గార్డ్‌నర్‌ 1–0–15–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement