డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (46), అనుష్క శర్మ (33), సోఫీ డివైన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (44 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.
భారతి ఫుల్మాలి 5 పరుగులతో అజేయంగా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో బెత్ మూనీ (5) మినహా ప్రతి ఒక్కరు ఓ మోస్తరు స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-29-1), నాట్ సీవర్ బ్రంట్ (4-0-36-1) కూడా పర్వాలేదనిపించారు.
హేలీ మాథ్యూస్ (4-0-40-0), వైష్ణవి శర్మ (2-0-21-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. అమన్‌జోత్ కౌర్ (2-0-13-0) పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తర్వాత రెండో స్థానంలో ఉంది.
ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు బెర్త్‌ల కోసం గుజరాత్‌తో పాటు ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్ 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో టేబుల్ చివరి స్థానంలో ఉంది.


