మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్‌లో ఇంకా కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీలో భాగంగా గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు మరో రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు పోటీ పడతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ(12) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానంలో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(6), ఢిల్లీ క్యాపిటల్స్(6), యూపీ వారియర్స్(4) ఉన్నాయి.
గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జట్టు శక్రవారం వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మిగితా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం వరకు ఎదురు చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది.
ముంబై ఇండియన్స్
గుజరాత్‌తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పరంగా గుజరాత్‌తో సమంగా నిలుస్తోంది. అయితే గుజరాత్(-0.271) కంటే ముంబై(+0.146) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నుందన హర్మన్ సేన ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్
జేమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ విజయం సాధించాలి. అదేవిధంగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం కూడా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసును ప్రభావితం చేస్తుంది. ఢిల్లీ రన్‌రేట్ ప్రస్తుతం -0.164 ఉంది. భారీ విజయం సాధిస్తేనే 2 పాయింట్లతో పాటు రన్‌రేట్ కూడా గణనీయంగా మెరుగపడుతోంది.
యూపీ వారియర్స్
ఇక యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. యూపీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లే ఉన్నాయి. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యూపీ భారీ విజయం సాధించాలి. అలాగే ముంబై ఇండియన్స్ గుజరాత్‌తో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ముంబై, యూపీ, ఢిల్లీ సమంగా నిలుస్తాయి. ఆ సమయంలో రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఓ జట్టు ఫ్లేప్స్‌లో అడుగుపెడుతోంది


