భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టును ఇవాళ (జనవరి 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మోనాంక్ పటేల్ ఎంపికయ్యాడు. గత ఎడిషన్‌లో (2024) ఆడిన 10 మంది ఆటగాళ్లు, ఈసారి కూడా చోటు దక్కించుకున్నారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య ప్రపంచకప్ జట్టులోకి వచ్చారు.
యూఎస్‌ఏకు ఇది రెండో టీ20 ప్రపంచకప్. గత ఎడిషన్‌లో ఈ జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించి, సూపర్-8కు కూడా అర్హత సాధించింది. ఈసారి కూడా యూఎస్‌ఏ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఆండ్రీస్ గౌస్, మోనాంక్ పటేల్ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. బౌలింగ్‌లో నేత్రవల్కర్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్ కీలకమయ్యే అవకాశం ఉంది.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ లాంటి జట్లతో పోటీపడాల్సి ఉన్న యూఎస్‌ఏ.. ఇదే గ్రూప్‌లోని నమీబియా, నెదర్లాండ్స్‌పై సంచలన విజయాలు సాధించే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 7న టీమిండియా మ్యాచ్‌తో యూఎస్‌ఏ తమ రెండో ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం యూఎస్‌ఏ జట్టు..
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.
గ్రూప్-ఏలో యూఎస్‌ఏ మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 7: ఇండియా vs USA (ముంబై)
- ఫిబ్రవరి 10: పాకిస్తాన్ vs USA (కొలంబో)
- ఫిబ్రవరి 13: నెదర్లాండ్స్ vs USA (చెన్నై)
- ఫిబ్రవరి 15: నమీబియా vs USA (చెన్నై)


