breaking news
Monank Patel
-
ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్‌కు అమెరికా వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- అమెరికా జట్లు మంగళవారం ముఖాముఖి తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.షెడ్యూల్ ప్రకారం పాక్- అమెరికా మధ్య రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆటగాడు మొహమ్మద్ మొహ్సిన్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్ టోర్నీలో పాక్‌ను తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈసారి కూడా ఓడిస్తాంపాక్తో మ్యాచ్‌కు ముందు మొహమ్మద్ మొహ్సిన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో గత మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. ఇక పాకిస్తాన్‌ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి మాకంటే కూడా వారి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఈ ప్రపంచకప్ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేదీ ఏమీ ఉండదు. ప్రస్తుతం మా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. టోర్నీని మేము మెరుగ్గానే ఆరంభించాము. పాకిస్తాన్‌పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం.మా జట్టు నైపుణ్యాలు గల ఆటగాళ్లతో కూడి ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా ఉంది. అందుకే పాక్‌ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత వరల్డ్‌కప్‌లో వారిపై గెలిచినందుకే ఈ ఆత్మవిశ్వాసం. గత మ్యాచ్ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’’ అని మొహ్సిన్ పేర్కొన్నాడు. కాగా మొహ్సిన్ పాక్‌లో పుట్టి పెరిగిన ఆటగాడు కావడం విశేషం.సంచలన విజయం కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ లీగ్ దశలో అమెరికా పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. అమెరికా కేవలం మూడు వికెట్లే నష్టపోయి 159 పరుగులు సాధించింది.ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించగా.. పాక్‌పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్-8కు చేరగా.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న మొదలైన టీ20 వరల్డ్‌కప్-2026లో సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ నెదర్లాండ్స్‌ను ఓడించి బోణీ కొట్టగా.. మొనాంక్ పటేల్ కెప్టెన్సీలోని అమెరికా టీమిండియాకు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలైంది. చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం -
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్ఏతో భారత్ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మిలింద్ కుమార్ (34) స్టంపౌట్. నాలుగో వికెట్ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్ 16, సంజయ్ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్ బౌలింగ్‌లో సాయితేజ ముక్కామల (2) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చాడు. మిలింద్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (0) శివం దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ తీసిన సిరాజ్1.4: అనూహ్యంగా వరల్డ్‌కప్ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్ టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే వికెట్ పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్‌లో తిలక్‌కు క్యాచ్ ఇచ్చి అమెరికా ఓపెనర్ ఆండ్రీ గౌస్ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్ డౌన్19.6: వరుణ్ చక్రవర్తి (0) రనౌట్.. తొమ్మిదో వికెట్ డౌన్అర్ష్దీప్ అవుట్18.6: షాల్విక్ బౌలింగ్‌లో... ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన అర్ష్‌దీప్ సింగ్ (4) సూర్యకుమార్ హాఫ్ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్ఏడో వికెట్ కోల్పోయిన భారత్16.4: హర్మీత్ బౌలింగ్‌లో మొహ్సిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). క్రీజులోకి అర్ష్‌దీప్ సింగ్. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్, సూర్య ధనాధన్15: నేత్రావల్కర్ బౌలింగ్‌లో అక్షర్ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్ కోల్పోయిన భారత్12.4: హర్మీత్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్ పటేల్. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్ కోల్పోయిన భారత్11.4: మొహ్సిన్ బౌలింగ్‌లో మిలింద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ అవుట్ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్5.6: వాన్ షాల్విక్ బౌలింగ్‌లో నేత్రావల్కర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన శివం దూబే. పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్ వర్మ అవుట్5.5: మూడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్). వాన్ షాల్విక్ బౌలింగ్ మోనాంక్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన తిలక్. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్ డౌన్5.2: వాన్ షాల్విక్ బౌలింగ్‌లో మిలింద్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, రెండు సిక్స్‌లు). క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. తిలక్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్ 13 బంతుల్లో 23, ఇషాన్ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.2: అలీ ఖాన్ బౌలింగ్‌లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్ బౌలింగ్... ఇషాన్ 7, అభిషేక్ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్‌కు లక్కీ ఛాన్స్‌అదే విధంగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక పేస్ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్ రాణా గాయపడటంతో సిరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్‌కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2026: భారత్ వర్సెస్ యూఎస్ఏ తుదిజట్లుభారత్ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్ఏఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ -
టీ20 ప్రపంచకప్ కోసం యూఎస్ఏ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును ఇవాళ (జనవరి 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మోనాంక్ పటేల్ ఎంపికయ్యాడు. గత ఎడిషన్‌లో (2024) ఆడిన 10 మంది ఆటగాళ్లు, ఈసారి కూడా చోటు దక్కించుకున్నారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య ప్రపంచకప్ జట్టులోకి వచ్చారు.యూఎస్ఏకు ఇది రెండో టీ20 ప్రపంచకప్. గత ఎడిషన్‌లో ఈ జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం సాధించి, సూపర్-8కు కూడా అర్హత సాధించింది. ఈసారి కూడా యూఎస్ఏ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఆండ్రీస్ గౌస్, మోనాంక్ పటేల్ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. బౌలింగ్‌లో నేత్రవల్కర్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్ కీలకమయ్యే అవకాశం ఉంది.గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ లాంటి జట్లతో పోటీపడాల్సి ఉన్న యూఎస్ఏ.. ఇదే గ్రూప్‌లోని నమీబియా, నెదర్లాండ్స్‌పై సంచలన విజయాలు సాధించే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 7న టీమిండియా మ్యాచ్‌తో యూఎస్ఏ తమ రెండో ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.టీ20 ప్రపంచకప్ 2026 కోసం యూఎస్ఏ జట్టు.. మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే. గ్రూప్-ఏలో యూఎస్ఏ మ్యాచ్‌లు - ఫిబ్రవరి 7: ఇండియా vs USA (ముంబై) - ఫిబ్రవరి 10: పాకిస్తాన్ vs USA (కొలంబో) - ఫిబ్రవరి 13: నెదర్లాండ్స్ vs USA (చెన్నై) - ఫిబ్రవరి 15: నమీబియా vs USA (చెన్నై) -
యూఎస్ఏ ప్రపంచకప్ జట్టులో వివాదాస్పద ఎంపికలు..?
యూఎస్ఏ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ పాత్ర లేకుండా కోచ్ పుబుడు దసనాయకే, కెప్టెన్ మోనాంక్ పటేల్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఎంపిక చేశారని ఓ అమెరికా సీనియర్ జర్నలిస్ట్ తెలిపారు.స్థానికంగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే శ్రీలంక బ్యాటర్ షేహాన్ జయసూర్యకు నేరుగా ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారని తెలుస్తుంది. పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఎహ్సాన్ అదిల్‌ను కూడా అర్హత ప్రామాణాలు చూడకుండా జట్టులోకి తీసుకున్నారని సమాచారం.యూఎస్ఏ హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ పుబుడు దసనాయకే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారని స్థానిక మీడియా అంటుంది. జట్టు ఎంపికలో కోచ్ పాత్రను పరిమితం చేయాలని జర్నలిస్ట్‌లు యూఎస్ఏ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నారు.ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం.. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8) కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల యూఎస్ఏ జట్టు ఇలా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా జెస్సీ సింగ్ ఎంపికయ్యాడు.మాజీ పాకిస్తాన్ ఆటగాడు ఎహ్సాన్ అదిల్, మాజీ శ్రీలంక బ్యాటర్ షేహాన్ జయసూర్య, లెగ్ స్పిన్నర్ మహ్మద్ మొహ్సిన్, మహారాష్ట్రలో (భారత్) జన్మించిన MLC స్టార్ శుభమ్ రంజనేమ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌ను నియమించినట్లు తెలుస్తుంది.కోచ్ పుబుడు దసనాయకే ప్రోద్బలంతో మాజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్‌కు ఆ పదవి కట్టబెట్టారని సమాచారం.టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు (లీకుల ప్రకారం)..మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఎహ్సాన్ అదిల్, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, షేహాన్ జయసూర్య, ఆరోన్ జోన్స్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, సాయి ముక్కమల్లా, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, రుషిల్ ఉగర్కర్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్. కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్ఏ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో యూఎస్ఏతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో యూఎస్ఏ తమ తొలి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 7) భారత్‌ను ఢీకొంటుంది. అనంతం ఫిబ్రవరి 10న పాకిస్తాన్, 13న నెదర్లాండ్స్, 15న నమీబియాతో పోటీపడనుంది. -
చరిత్ర సృష్టించిన మోనాంక్ పటేల్.. మేజర్ లీగ్ క్రికెట్లో అత్యధిక స్కోర్
మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఆటగాడు మోనాంక్ పటేల్ చరిత్ర సృష్టించాడు. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జూన్ 19) సియాటిల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగులు (50 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసిన అతను.. ఈ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన అమెరికన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కోరె ఆండర్సన్ పేరిట ఉండేది. 2023 ఎడిషన్‌లో ఆండర్సన్ శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌పై అజేయమైన 91 పరుగులు (52 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చేశాడు. ఎంఎల్‌సీలో అత్యధిక పరుగులు చేసిన అమెరికన్ ఆటగాళ్ల జాబితాలో మోనాంక్, ఆండర్సన్ తర్వాతి స్థానాల్లో సంజయ్ కృష్ణమూర్తి (79 నాటౌట్), ఉన్ముక్త్ చంద్ (68) ఉన్నారు.ఓవరాల్‌గా ఎంఎల్‌సీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు ఫిన్ అలెన్ పేరిట ఉంది. అలెన్ ఇదే సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడంపై 151 పరుగులు (51 బంతుల్లో) చేశాడు. ఎంఎల్సీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నికోలస్ పూరన్ పేరిట ఉంది. పూరన్ 2023 ఎడిషన్‌లో అజేయమైన 137 పరుగులు చేశాడు. అలెన్, పూరన్ తర్వాతి స్థానాల్లో క్లాసెన్ (110 నాటౌట్), మ్యాక్స్‌వెల్ (106 నాటౌట్), రికెల్టన్ (103 నాటౌట్), ఫిన్ అలెన్ (101), డుప్లెసిస్ (100) ఉన్నారు. పైన పేర్కొన్న ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకే ఎంఎల్‌సీలో సెంచరీలు చేశారు. ఇందులో అలెన్ ఒక్కడు రెండు సెంచరీలు చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సియాటిల్ ఓర్కాస్‌పై ఎంఐ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మోనాంక్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ (93) ఆడి ఎంఐను గెలిపించాడు. మోనాంక్‌కు మైఖేల్ బ్రేస్‌వెల్ (35 బంతుల్లో 50 నాటౌట్), కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 26 నాటౌట్) తోడవ్వడంతో ఓర్కాస్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎంఐ న్యూయార్క్ మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది.అంతకుముందు కైల్ మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్ (46 బంతుల్లో 88) ఆడటంతో ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో షాయాన్ జహంగీర్ 43, క్లాసెన్ 27 (నాటౌట్), హెట్‌మైర్ 21, వార్నర్ 4, ఆరోన్ జోన్స్ 10 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ ధారాళంగా పరుగులు సమర్పించుకొని (4 ఓవర్లలో 64) 2 వికెట్లు తీశాడు. -
మోనాంక్ పటేల్ సూపర్ సెంచరీ.. యూఎస్ఏ భారీ స్కోర్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2 మ్యాచ్‌ల్లో భాగంగా కెనడాతో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో యూఎస్ఏ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. మోనాంక్ పటేల్ సూపర్ సెంచరీతో (95 బంతుల్లో 121 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో స్మిత్ పటేల్ (63), షయాన్ జహంగీర్ (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ టేలర్ 27, ఆరోన్ జోన్స్ 15, మిలింద్ కుమార్ 0 పరుగులకు ఔటయ్యారు. కెనడా బౌలర్లలో దిల్లన్ హేలిగర్, హర్ష్ థాకర్, సాద్ బిన్ జాఫర్, పర్గత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కెనడా.. 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆరోన్ జాన్సన్ 42, ఆధిత్య వరదరాజన్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కెనడా గెలుపుకు 42 ఓవర్లలో ఇంకా 254 పరుగులు చేయాల్సి ఉంది. -
అక్షర్, బుమ్రాతో నేను కలిసి క్రికెట్ ఆడాను: అమెరికా కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2024లో సంచలన విజయాలు నమోదు చేస్తున్న అమెరికా జట్టు ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా పటిష్టమైన టీమిండియాను అమెరికా ఢీ కొట్టనుంది. పాక్‌పై విజయం సాధించి మంచి ఊపులో ఉన్న ఆతిథ్య అమెరికా.. భారత్‌పై కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియాను అడ్డుకునేందుకు యూఎస్ఎ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది. ఈ క్రమంలో యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్.. భారత ఆటగాళ్లు అక్షర్ పటేల్,జస్ప్రీత్ బుమ్రాతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ తను ఒకే పట్టణం నుంచి వచ్చామని మోనాంక్ పటేల్ తెలిపాడు."అండర్-19, అండర్-15 మ్యాచ్‌ల్లో గుజరాత్ తరపున అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నేను ఒకే గ్రామం నుంచి క్రికెట్ కెరీర్ వైపు అడుగులు వేశాము. అక్షర్ మా ఊరిలో చాలా యువకులకు ఆదర్శంగా నిలిచాడు. అంతేకాకుండా వారికి క్రికెట్ వైపు అడుగులు వేసేందుకు అన్నిరకాలగా అక్షర్ మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు బుమ్రా, అక్షర్ భారత జట్టులో కీలక ఆటగాళ్లగా కొనసాగుతుండటం చాలా సంతోషంగా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫిరెన్స్‌లో మోనాంక్ పటేల్ పేర్కొన్నాడు. కాగా మోనాంక్ పటేల్ భారత సంతతికి చెందిన ఆటగాడు కావడం గమనార్హం.ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. -
పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్?
టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా జట్టు పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అమెరికా ఘన విజయం సాధించింది.సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాక్‌ను అమెరికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితాన్ని నిర్ణయించాల్సింది.సూపర్ ఓవర్లో అమెరికా అదుర్స్..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ సూపర్ ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ అమీర్ ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 7 పరుగులివ్వడం గమనార్హం. అనంతరం అమెరికా తరపున సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే..ఇక పాకిస్తాన్‌ను ఓడించిన అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు నలుగురు ఉండటం గమనార్హం. యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి ఆటగాళ్లు భారత మూలాలు ఉన్న క్రికెటర్లే.అమెరికా విజయంలో మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో మోనాంక్ పటేల్(50) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నేత్రావల్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు పాకిస్తాన్ మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించిన మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ సౌరభ్ నేత్రావల్కర్?సౌరభ్ నేత్రావల్కర్ ముంబైలో జన్మించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుత భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి నేత్రావల్కర్ ఆడాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్లో ముంబైకు నేత్రావల్కర్ ప్రాతినిథ్యం వహించాడు.క్రికెట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఉద్యోగంపై దృష్టిసారించాడు. 2013లో ముంబై యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరభ్.. అనంతరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు.ఆ తర్వాత ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. కానీ క్రికెట్‌పై మక్కువ మాత్రం నేత్రావల్కర్‌కు పోలేదు. జాబ్ చేస్తుండగానే గల్ఫ్ జెయింట్స్, సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడేవాడు. అనంతరం అమెరికా దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. SAURABH NETRAVALKAR - THE MULTI TALENTED GUY! 🥶If being a software engineer at Oracle, defeating Pakistan wasn't enough, he has previously shared his videos on Instagram Playing Ukulele. 😄👌 pic.twitter.com/uIGWofSkPZ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2024 -
T20 WC 2024 : సంచలనం..పాక్‌ను చిత్తు చేసిన అమెరికా (ఫొటోలు)
-
టీమిండియాతోనూ ఇలాగే ఆడతాం: యూఎస్ఏ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొట్టింది. డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసి జయభేరి మోగించింది.వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. మెగా టోర్నీ అరంగేట్రంలో తమ తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ఏ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మొనాక్ పటేల్ స్పందించాడు.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా‘‘ఆరోన్ జోన్స్ ఎలా ఆడాతాడో మా అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తను మాత్రం దూకుడుగానే ఆడతాడు. ఈరోజు ఇక్కడ మమ్మల్ని సపోర్టు చేయడానికి చాలా మంది వచ్చారు.టోర్నీలో ఇక ముందు కూడా వారందరూ(ప్రేక్షకులు) మాకు ఇలాగే మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ మెగా ఈవెంట్లో మున్ముందు కూడా మేము ఇలాగే ఫియర్లెస్ క్రికెట్ ఆడతాం.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా మా ఆట తీరులో ఎలాంటి మార్పూ ఉండదు. దూకుడుగానే ముందుకువెళ్తాం’’ అని మొనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు.గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ కాగా భారత్‌లోని గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ అమెరికాలో సెటిలయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2019లో యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎదిగి వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు మొనాక్ పటేల్. ఇక 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కెనడాతో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్(జూన్ 6)తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024 అమెరికా వర్సెస్ కెనడా స్కోర్లు👉వేదిక: డలాస్👉టాస్:అమెరికా.. తొలుత బౌలింగ్👉కెనడా స్కోరు: 194/5 (20)👉అమెరికా స్కోరు: 197/3 (17.4)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కెనడాపై అమెరికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆరోన్ జోన్స్(40 బంతుల్లో 94 రన్స్, నాటౌట్).చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా View this post on Instagram A post shared by ICC (@icc)


