డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్‌లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ సాధించింది. యూపీ వారియర్జ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. లక్ష్య చేధనలో స్మృతి మందాన (54) , గ్రేస్ హారీస్ (75) అర్థ జెంచరీలతో అదరగొట్టారు. వడోదర వేదికగా యూపీ వారియర్జ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. యూపీని 143 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.
అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే ఆర్సీబీ చేధించింది. 8 మ్యాచ్‌ల్లో ఆరో విజయం అందుకున్న బెంగళూరు 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. బెంగళూరు ఫైనల్‌కు వెళ్లడం ఇది రెండోసారి కాగా 2024లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
వారియర్జ్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, దీప్తి శర్మ మినహా ఎవ్వరూ రాణించలేదు. హర్లీన్ డియోల్ (14), సిమ్రన్ షేక్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్ (1), క్లో ట్రయెన్ (6), శ్వేతా సెహ్రావత్ (7), సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ డకౌటైంది. ఆఖరి ఓవర్‌లో క్లెర్క్ 2 వికెట్లు తీసి వారియర్జ్‌ను కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోనివ్వలేదు.


