ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్‌’కు అర్హత | Last league match against UP today | Sakshi
Sakshi News home page

ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్‌’కు అర్హత

Feb 1 2026 3:50 AM | Updated on Feb 1 2026 3:50 AM

Last league match against UP today

నేడు యూపీతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ 

రా. 7.30 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్‌’, ‘జియో హాట్‌స్టార్‌’లలో ప్రత్యక్ష ప్రసారం

వడోదర:  మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌ అవకాశాల్ని మెరుగుపరిచాయి. టోర్నీలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్‌కే ‘ఎలిమినేటర్‌’ చాన్స్‌ ఉంది. నేడు యూపీ వారియర్స్‌తో జరిగే చివరి లీగ్‌ పోరులో ఢిల్లీ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా గుజరాత్‌ జెయింట్స్‌తో ఎలిమినేటర్‌ ఆడే అర్హత సాధిస్తుంది. 

అయితే ఓడినా ముందంజ వేసేందుకు స్వల్ప అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీకి ప్రస్తుతం సమానంగా 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబైకంటే ఢిల్లీ రన్‌రేట్‌ చాలా తక్కువగా ఉంది. రన్‌రేట్‌ మైనస్‌లో ఉంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే  ఢిల్లీ ముందుకెళుతుంది. 

షఫాలీ, లిజెల్లీ, లారా వోల్వార్డ్‌లతో కూడిన టాపార్డర్‌ ధాటిగా పరుగులు చక్కబెడితే యూపీపై భారీస్కోరును సునాయాసంగానే సాధించవచ్చు. కెపె్టన్‌ జెమీమా, మరిజాన్, నికీ ప్రసాద్‌లు కూడా ధనాధన్‌ ఆట ఆడేయగలరు. బౌలింగ్‌లో షినెల్‌ హెన్రీ, మరిజాన్, నందిని, శ్రీచరణిలు ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.  మరోవైపు అట్టడుగున ఉన్న యూపీ కేవలం రెండే మ్యాచ్‌ల్లో గెలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement