నేడు డబ్ల్యూపీఎల్ ‘ఎలిమినేటర్’ మ్యాచ్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ జెయింట్స్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఇప్పటి వరకు మూడు సీజన్లు జరగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లూ ఫైనల్‌కు చేరింది. అయితే దురదృష్టవశాత్తూ ప్రతీసారి ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ఆఖరి స్థానానికే పరిమితం కాగా... గత ఏడాది మాత్రం రెండో స్థానంతో ఎలిమినేటర్‌కు అర్హత సాధించినా ... అదే మ్యాచ్‌లో ఓడి ని్రష్కమించింది. ఈసారైనా ఆ దశను దాటి తొలిసారి తుది పోరుకు చేరాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది.
స్పిన్నర్లు కీలకం...
గత మూడు సీజన్లలో గ్రూప్ దశలో అగ్రస్థానంతో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఈసారి కాస్త తడబాటును ప్రదర్శించిన జట్టు ఇప్పుడు ఫైనల్ కోసం ఎలిమినేటర్‌లో ఆడుతోంది. బ్యాటింగ్ పరంగా చూస్తే టాప్–5తో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది.
ఓపెనర్లు లిజెల్ లీ, షఫాలీ వర్మ శుభారంభం అందిస్తే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాతి బ్యాటర్లలో లారా వోల్‌వార్ట్, కెప్టెన్ జెమీమా, మరిజాన్ కాప్ చకచకా పరుగులు రాబట్టగలరు. అయితే టీమ్ ప్రధానంగా స్పిన్నర్లపై ఆధారపడుతోంది. శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగల సమర్థులు
సమష్టి ప్రదర్శనపై భారం...
విదేశీ క్రికెటర్ల ప్రదర్శనతోనే తాజా సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ ముందంజ వేసిందనడంలో సందేహం లేదు. ముగ్గురు ఆ్రస్టేలియన్లు కెపె్టన్ యాష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ, జార్జియా వేర్‌హామ్ తమ ఆటతో ప్రతీసారి ప్రభావం చూపించగా, న్యూజిలాండ్ సీనియర్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటింది. మరోసారి జెయింట్స్ ఈ ప్లేయర్లపైనే ఆధారపడుతోంది. భారత ఆటగాళ్లలో అనుష్క శర్మ మాత్రమే మూడో స్థానంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది. గుజరాత్ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు గెలవగా... ఐదుసార్లు తొలుత బ్యాటింగ్ చేసి విజయాన్నందుకోవడం విశేషం.


