గుజరాత్ వడోదరలో ఈరోజు జరిగిన WPL మ్యాచులో ముంబై ఇండియన్స్ పై 11 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది. అనంతరం చివరి నిమిషం దాకా పోరాడిన ముంబై పరుగుల చేధనలో ముంబై 156 స్కోరు మాత్రమే చేయగలిగింది. ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెలరేగి ఆడి 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్, జార్జియా వేరేహమ్ తల రెండువికెట్లు తీయగా, కేశవీ గౌతమ్, రాజేశ్వర్ గైక్వాడ్, గార్డెనర్ తలో వికెట్ తీశారు. అదేవిధంగా ఆ జట్టు బ్యాటర్లలో ఆప్లే గార్డెనర్ 46 పరుగులు, జార్జిమ్ వార్హెమ్ 44 పరుగులు సాధించారు. ఈ విజయంతో గుజరాత్ నాకౌట్‌కు చేరుకుంది.


