‘ఎలిమినేటర్‌’కు ఢిల్లీ క్యాపిటల్స్‌ | Delhi Capitals qualify for the Eliminator in the Womens Premier League | Sakshi
Sakshi News home page

‘ఎలిమినేటర్‌’కు ఢిల్లీ క్యాపిటల్స్‌

Feb 2 2026 2:15 AM | Updated on Feb 2 2026 2:15 AM

Delhi Capitals qualify for the Eliminator in the Womens Premier League

వడోదర: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘ఎలిమినేటర్‌’ పోరుకు అర్హత పొందింది. ఆదివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ సారథ్యంలోని ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 

దీప్తి శర్మ (24; 4 ఫోర్లు, 1సిక్స్‌), సిమ్రన్‌ షేక్‌ (22; 3 ఫోర్లు), శిఖా పాండే (23; 3 ఫోర్లు) రెండు పదులు స్కోర్లు చేశారు. మరిజాన్‌ కాప్‌ 3, హెన్రీ, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 

వోల్వార్డ్‌ (47; 7 ఫోర్లు) రాణించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ మంగళవారం జరిగే గుజరాత్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఇప్పటికే  బెంగళూరు నేరుగా ఫైనల్‌ చేరింది.   చివరి లీగ్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం 

Advertisement
 
Advertisement
Advertisement