ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఊహించ‌ని షాక్‌ | Big blow to DC as Mitchell Starc joins Cummins and Hazlewood in list of player to miss early IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఊహించ‌ని షాక్‌

Mar 20 2026 11:19 AM | Updated on Mar 20 2026 11:21 AM

Big blow to DC as Mitchell Starc joins Cummins and Hazlewood in list of player to miss early IPL 2026

ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఈ ఏడాది సీజ‌న్ ఫ‌స్ట్ హాఫ్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అత‌డు సెకెండ్ హాఫ్‌లో ఢిల్లీ జ‌ట్టుతో చేర‌నున్న‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆస్ట్రేలియా రాబోయే 12 నెలల్లో దాదాపు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అదేవిధంగా వ‌చ్చే ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నుంది.

దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా త‌మ ప్ర‌ధాన పేస‌ర్ల‌ను లీగ్ క్రికెట్‌లో ఎక్కువగా ఆడించి రిస్క్ తీసుకూడ‌ద‌ని భావిస్తుందంట‌. ఈ కార‌ణంతో అత‌డు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు స్టార్క్‌ను రూ.11.75 కోట్ల భారీ ధ‌ర‌కు రిటైన్ చేసుకుంది.

కానీ అత‌డు ఇప్పుడు అందుబాటులో లేక‌పోవ‌డం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.  అయితే ఢిల్లీ జ‌ట్టులో లుంగి ఎంగిడీ, కైల్ జేమీస‌న్‌, దుష్మంత చ‌మీర వంటి స్టార్ పేస‌ర్లు ఉండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా స్టార్క్ ఏప్రిల్ మూడో వారం నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఈ విష‌యంపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెల‌వ‌డ‌లేదు.

మ‌రోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ కూడా ఆరంభ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో ఇషాన్ కిష‌న్ ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జోష్ హాజిల్‌వుడ్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెల‌కొంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు
బ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్

ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్‌), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణా

బౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్
చదవండి: IPL 2026: 'సెహ్వాగ్‌ను చూసి నేర్చుకో'.. అభిషేక్‌కు కుంబ్లే వార్నింగ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement