ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో షురూ కానుంది. మార్చి 28న ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అభిషేక్ తన దూకుడుకు కాస్త 'నిలకడ'ను తోడు చేస్తే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో తిరుగులేని ఆటగాడిగా ఎదుగుతాడని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా 25 ఏళ్ల అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 బ్యాటర్ కొనసాగుతున్నాడు.
అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం 141 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తనకు కలిసొచ్చిన ఐపీఎల్‌లో సత్తాచాటాలని అభిషేక్ ఉవ్విళ్లూరుతున్నాడు.
"అభిషేక్‌ను వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండరీ ఆటగాడితో పోల్చాలనుకుంటున్నాను. ఎందుకంటే సెహ్వాగ్ కూడా ప్రతీ బంతినీ బాదడానికే చూసేవాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే చేస్తున్నాడు. అయితే సెహ్వాగ్ క్రమంగా తన ఆట తీరులో మార్పు చేసుకున్నాడు.
టెస్టు నుంచి వన్డేలకు, ఆపై టీ20ల్లో ఆడేటప్పుడు.. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో అతడు గ్రహించాడు. అయినప్పటికీ సెహ్వాగ్ 140–150 స్ట్రైక్ రేటుతోనే బ్యాటింగ్ చేసేవాడు. కాబట్టి అభిషేక్ ఇప్పుడు అదే బాటలో నడవాలి. అభిషేక్ 200, ఆపై 300 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు.
కేవలం దూకుండా ఆడి అవుట్ అవ్వడం కంటే, ఎక్కువ బంతులు ఆడి క్రీజులో గడపడం ముఖ్యం. అభిషేక్ శర్మ క్రీజులో కనీసం 20 బంతులు ఆడితే, అతడు ఖచ్చితంగా 50 పరుగుల మార్కుకు చేరుకుంటాడని మనకు తెలుసు. సంజూ శాంసన్ విషయంలో కూడా మనం అదే చూశాం.
అతడు 40, 50 పరుగుల వద్ద అవుట్ కాకుండా, ఎక్కువ సేపు క్రీజులో నిలబడి 85-90 రన్స్ చేసి జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే చేయాలి. టీ20 ఫార్మాట్‌లో జట్టుకు కావాల్సింది అదే. ఈ సీజన్‌లో అభిషేక్‌లో తన ఆట తీరును మార్చుకుంటాడని ఆశిస్తున్నా" అని జియో స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్


