ఐపీఎల్‌ నుంచి మరో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌ | Injuries impacting IPL 2026, England all-rounder Sam Curran to miss season due to groin injury | Sakshi
Sakshi News home page

IPL 2026: ఐపీఎల్‌ నుంచి మరో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

Mar 20 2026 7:57 AM | Updated on Mar 20 2026 8:52 AM

Injuries impacting IPL 2026, England all-rounder Sam Curran to miss season due to groin injury

ఐపీఎల్‌-2026 సీజన్‌కు దాదాపు అన్ని జట్లకు గాయాల బెడద వెంటాడుతోంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ గాయం కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ నుంచి తప్పుకొన్నాడు. కర్రన్‌ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 సమయంలోనే అతడికి ఈ సమస్యతలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.

నిజంగా ఇది రాజస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో కర్రాన్ బంతితో పాటు కూడా రాణించాడు. గతేడాది ఐపీఎల్‌లో సీజన్‌లో కూడా సీఎస్‌కే తరపున కర్రాన్ ఆకట్టకున్నాడు. 

అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలానికి ముందు ట్రేడింగ్ విండోలో భాగంగా సంజూ శాంసన్ సీఎస్‌కేకు వెళ్లగా.. అందుకు బదులుగా రవీండ్ర జడేజాతో కలిసి కర్రన్‌ రాజస్తాన్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు దూరమయ్యాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో రాజస్తాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ పడింది.

రాజస్తాన్ జట్టు
ధృవ్ జురెల్ (వికెట్ కీపర్‌), డోనోవన్ ఫెరీరా, షిమ్రాన్‌ హెట్మెయర్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, విఘ్నేష్ పుత్తూర్, రవి సింగ్, అమన్ రావ్, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్నే
చదవండి: IPL 2026: తొలి టైటిల్‌ వేటలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement