స‌న్‌రైజ‌ర్స్‌, సీఎస్‌కే, ముంబై కాదు.. ఆ జ‌ట్టే ఐపీఎల్ విజేత‌! | DC to win IPL 2026, Sanju Samson to win Orange Cap: Aakash Chopra | Sakshi
Sakshi News home page

IPL 2026: స‌న్‌రైజ‌ర్స్‌, సీఎస్‌కే, ముంబై కాదు.. ఆ జ‌ట్టే ఐపీఎల్ విజేత‌!

Mar 16 2026 12:59 PM | Updated on Mar 16 2026 1:10 PM

DC to win IPL 2026, Sanju Samson to win Orange Cap: Aakash Chopra

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఐపీఎల్‌-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయో, టైటిల్ విజేత ఎవరన్నదానిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను వెల్లడించాడు. ఆకాష్ చోప్రా ఇటీవల క్రిక్స్ యాప్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పలు ప్రశ్నలు చోప్రాకు ఎదురయ్యాయి.

హోస్ట్‌: ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు) ఎవరు గెలుస్తారు?
ఆకాష్‌ చోప్రా: సంజూ శాంసన్. (ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సీఎస్‌కే తరపున ఆడనున్నాడు.)

హోస్ట్‌: పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఎవరు గెలుస్తారు?
చోప్రా: జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)

హోస్ట్‌: ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కుతుంది?
చోప్రా:  వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం).

హోస్ట్‌: ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి?
చోప్రా: ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు చేరుతాయి.

హోస్ట్‌: ఐపీఎల్‌ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారు?
చోప్రా: ఈసారి మనం సరికొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాము. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్‌

కాగా చోప్రా ప్లే ఆఫ్స్‌కు చేరే జట్ల జాబితాలో ఐదు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement