భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది.
మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్‌ను రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్ టీమ్‌తో హర్మన్ బృందం వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.
2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్ (52), కెప్టెన్ అంజుమ్ చోప్రా (80), మిథాలీరాజ్ (55), హేమలతా కలా (64), మమతా మబెన్ (50) అర్థసెంచరీలతో రాణించారు.
ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.
సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..
డిసెంబర్ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్ జట్టుతో వార్మప్‌మ్యాచ్
డిసెంబర్ 9: తొలి వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్
డిసెంబర్ 12: రెండో వన్డే, బ్లోమ్‌ఫోంటైన్
డిసెంబర్ 15: మూడో వన్డే, కేప్‌టౌన్‌డిసెంబర్ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్, గెబెర్హా


