ఐపీఎల్-2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడా? అంటే అవునానే సమాధానమిస్తోంది. రాహుల్ గత సీజన్‌లలో చాలా మ్యాచ్‌లలో మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌లు అందుబాటులో ఉండటంతో రాహుల్‌కు ఓపెనర్‌గా పెద్దగా అవకాశం దక్కలేదు.
అయితే జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఓపెనర్‌గా విఫలం కావడంతో ఆఖరి మ్యాచ్‌లలో రాహుల్‌కు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం దక్కింది. కేఎల్ ఓపెనర్‌గా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు.
దీంతో ఈ ఏడాది సీజన్‌లో రాహుల్‌ను ఫుల్ టైమ్ ఓపెనర్‌గా ఢిల్లీ టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. రాహుల్ గత సీజన్‌లో 150 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రాహుల్ పార్టనర్ ఎవరు?
అయితే రాహుల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఇన్నింగ్స్ ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత ఢిల్లీ జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోపం నలుగురు పోటీలో ఉన్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్, శ్రీలంక స్టార్ పాథుమ్ నిస్సాంక ఉన్నారు.
వీరిద్దరూ తమ తమ జట్ల ఇన్నింగ్స్‌లను ప్రారంభిస్తుంటారు. మరోవైపు భారత ఆటగాళ్లు పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ కూడా ఉన్నారు. వీరిద్దరికి ఢిల్లీ తరపున ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. కాగా అభిషేక్‌కు ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉంది. కాబట్టి ప్రధానంగా డకెట్, నిస్సాంక, పృథ్వీషా మధ్యనే పోటీ నెలకొంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 జట్టు
బ్యాటర్లు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణా
బౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్
చదవండి: 'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్‌కు చుక్కలే'


