'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్‌కు చుక్కలే' | Afghanistan Star Allah Ghazanfar Sends Message To India After Deadly Air Strikes By Pakistan, Check Details Inside | Sakshi
Sakshi News home page

'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్‌కు చుక్కలే'

Mar 18 2026 9:03 AM | Updated on Mar 18 2026 9:56 AM

Afghanistan Star Allah Ghazanfar Sends Message To India After Deadly Air Strikes By Pakistan

అఫ్గానిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లోని ఓ రిహేబిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జ‌రిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ బాంబు దాడుల్లో 400 మంది మరణించగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష చర్యపై అఫ్గాన్ యువ సంచలనం, ముంబై ఇండియన్స్ అల్లా ఘజన్‌ఫర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఘజన్‌ఫర్ కోరాడు.

"అక్కడ చికిత్స పొందుతున్న వారంతా పేదవారే. వారికి ప్రైవేటు అస్పత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేదు. ఇప్పుడు ఆ ఆసుపత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని ప్రజల ప్రాణాలను బలికొన్నారు. ఇది ఏ మాత్రం  ఆమోదయోగ్యం కాదు. వారు ఇటువంటి హేయమైన చర్యలతో ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు.

సామాన్య ప్రజలను పొట్టనబెట్టుకుని ఏమి సాధించారు. దీనిని మేము ఏమాత్రం అంగీకరించలేము. అఫ్గాన్ చరిత్ర అందరికీ తెలుసు. ఒకవేళ ఆ చరిత్ర మళ్ళీ రిపీట్ అయితే, అది పాక్‌కు చాలా ప్రమాదకరంగా మారుతుందిష అని న్యూస్ 18తో ఘజన్‌ఫర్ పేర్కొన్నాడు.

అదేవిధంగా భారత్‌-అఫ్గాన్ సంబంధాలపై కూడా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. "భారత్ మాకు మంచి మిత్ర దేశం. ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు భారత్‌తో చర్చలు జరపాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి యుద్ధ వాతావరణం ఎవరికీ మంచిది కాదని" ఘజన్‌ఫర్ తెలిపాడు. కాగా ఈ ఘటనపై ఘజన్‌ఫర్‌తో పాటు రషీద్ ఖాన్‌, నబీ, నవీన్ ఉల్ హక్ వంటి పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఆవేదన వ్యక్తంచేశారు.
చదవండి: సన్‌రైజర్స్‌పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement