సన్‌రైజర్స్‌పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్! | Pakistan Stars Reaction To Row Over Joining SRH Owned The Hundred Team Revealed, Sparks Debate In India | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్!

Mar 18 2026 8:13 AM | Updated on Mar 18 2026 10:13 AM

Pakistan Stars Reaction To Row Over Joining SRH-Owned The Hundred Team Revealed

ఇంగ్లండ్  'ది హండ్రెడ్' (The Hundred) వేలంలో పాకిస్తాన్ స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మద్‌ను స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ కొనుగోలు చేయ‌డం పెను వివాదానికి దారి తీసిన సంగ‌తి తెలిసిందే. లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ వేలంలో అబ్రార్‌ను  సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు 1.90 లక్షల పౌండ్ల (సుమారు రూ.2.3 కోట్లు)కు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ ఫ్రాంచైజీ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ ఓన‌ర్ ఒక్క‌రే. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్యా మార‌న్  తీసుకున్న ఈ నిర్ణ‌యంపై భార‌త్‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురువుతోంది. తాజాగా ఇదే విష‌యంపై భార‌త మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సైతం తీవ్రంగా స్పందించారు. 

ఇది పరోక్షంగా పాకిస్తాన్ మిలిటరీకి నిధులు సమకూర్చినట్లే అని ఆయ‌న వ్యాఖ్య‌నించారు. అది భారత సైనికుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఆయన మండిపడ్డారు. గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పాకిస్తాన్ అండ‌ర్‌-19 కెప్టెన్ అజీమ్ రఫీక్ తప్పుపట్టారు. మీరు ఎన్ని పరుగులు చేశారన్నది ముఖ్యం కాదు, ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఆమోదయోగ్యం కాదు" అని ర‌ఫీక్ పేర్కొన్నాడు.

అయితే ఈ వివాదాన్ని అబ్రార్‌ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం. "అబ్రార్ ఒప్పందంపై ఈ రక‌మైన విమ‌ర్శ‌లు ముందే ఊహించాం. కానీ అబ్రార్ ఈ వివాదంపై ఏ మాత్రం ఆందోళ‌న చెంద‌డం లేదు. అబ్రార్ ప్రపంచవ్యాప్తంగా లీగ్స్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉండటంతో ది హండ్రెడ్ కోసం త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు. 

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-3లో ఉండ‌డంతో వేలంలో అత‌డు భారీ ధ‌ర ద‌క్కింది. అత‌డు అందుకు క‌చ్చితంగా అర్హుడు. సన్‌రైజర్స్ లీడ్స్ కోచ్  డేనియల్ వెట్టోరి అబ్రార్ ఫోన్ చేసి త‌న‌ను కొనుగోలు చేసిన విష‌యాన్ని తెలియ‌జేశాడు. త‌మతో ట‌చ్‌లో ఉండాల‌ని సూచించార‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ‌ర్గాలు టెలికామ్‌సియానెట్‌కు వెల్ల‌డించాయి.
చదవండి: భార్య మాట... బంగారు బాట!

Advertisement
 
Advertisement
Advertisement