breaking news
Abrar Ahmed
-
ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్
అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్‌తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది.ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ బ్యాటింగ్ యువ కెరటం లూసీ లైల్స్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్‌గా కనిపించారు. లూసీతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బ్రూక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్ 18 నుంచి ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.అబ్రార్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్ స్పిన్నర్ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వీ సహా పలువురు పాక్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్-2025లో నఖ్వీకి, పాక్ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్ రిసెప్షన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ పాక్‌ను ఫైనల్ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్‌ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. చదవండి: స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..! -
వెక్కిరించిన పాక్ బౌలర్.. ఇచ్చిపడేసిన హసరంగ
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గట్టెక్కింది. సూపర్-4లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్ అవకాశాలు సజీవం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) అతి చేశాడు.వెక్కిరించిన పాక్ బౌలర్శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga)ను అవుట్ చేసిన తర్వాత.. హసరంగను అనుకరిస్తూ అతడి శైలిలోనే సెలబ్రేట్ చేసుకుని.. ఏవో మాటలు అన్నాడు. ఇందుకు సహచర ఆటగాళ్లు కూడా వంత పాడారు. శ్రీలంక ఇన్నింగ్స్ పదమూడో ఓవర్ తొలి బంతికి ఈ ఘటన జరిగింది.టాపార్డర్ విఫలమైన వేళ కమిందు మెండిస్ అర్ధ శతకం (50)తో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హసరంగ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు బాది 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. అబ్రార్ అహ్మద్ హసరంగను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే అతడిని వెక్కిరించినట్లుగా సెలబ్రేట్ చేసుకున్నాడు.ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగఅయితే, వనిందు హసరంగ ఇందుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. పాక్ లక్ష్య ఛేదనకు దిగినపుడు.. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో.. ఓపెనర్ ఫఖర్ జమాన్ (17) క్యాచ్ అందుకున్న హసరంగ.. అబ్రార్ మాదిరి గాల్లోకి జంప్ కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత సయీమ్ ఆయుబ్ (2), కెప్టెన్ సల్మాన్ ఆఘా (5) రూపంలో కీలక వికెట్లు తీసి మరోసారి అబ్రార్‌ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, మ్యాచ్ తర్వాత అబ్రార్ హసరంగకు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.ఫైనల్ ఆశలు సజీవంఇక మ్యాచ్ విషయానికొస్తే.. అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్..లంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో అసలంక బృందం నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది.పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది మూడు, హ్యారీస్ రవూఫ్, హుసేన్ తలట్ రెండేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్ సాహిబ్జాదా (24), హుసేన్ తలట్ (32 నాటౌట్), మొహమ్మద్ నవాజ్ (38 నాటౌట్) రాణించడంతో పాక్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి.. ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: పాయింట్ తేడాతో గట్టెక్కిన టైటాన్స్In today’s episode of "𝘈𝘴 𝘺𝘰𝘶 𝘴𝘰𝘸, 𝘴𝘰 𝘴𝘩𝘢𝘭𝘭 𝘺𝘰𝘶 𝘳𝘦𝘢𝘱…" 🤭Watch the #DPWorldAsiaCup2025 from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #PAKvSL pic.twitter.com/evBAkIIEyx— Sony Sports Network (@SonySportsNetwk) September 23, 2025Man I just love this celebration. Abrar should steal it. pic.twitter.com/O380ryOLun— Hopeful (@high_hopeful) September 23, 2025 -
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.దుబాయ్ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.అబ్రార్ అహ్మద్ అత్యద్భుతంఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.షాహిన్ ఆఫ్రిది మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్ అహ్మద్ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్‌లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.ఎలాంటి జట్టునైనా ఓడించగలముమున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.నాటకీయ పరిణామాల నడుమకాగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్‌లను ఓడించి టీమిండియా తొలుత సూపర్ ఫోర్కు అర్హత సాధించగా.. ఒమన్ ఎలిమినేట్ అయింది. అయితే, గ్రూప్-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్‌కాట్ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్‌కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ స్కోర్లుటాస్: యూఏఈ.. తొలుత బౌలింగ్పాక్ స్కోరు: 146/9 (20)యూఏఈ స్కోరు: (17.4)ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాహిన్ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్.. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
‘పసికూన’పై ప్రతాపం.. ఫైనల్లో పాకిస్తాన్
ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఫైనల్ చేరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాక్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ ట్రై సిరీస్‌లో పాక్‌కు ఇది మూడో విజయం ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా (Salman Agha) బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది.కాగా ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా యూఏఈ- అఫ్గనిస్తాన్- పాకిస్తాన్ త్రైపాక్షిక సిరీస్ ఆడుతున్నాయి. షార్జా వేదికగా జరగుతున్న ఈ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలుత అఫ్గనిస్తాన్‌ను ఓడించిన పాక్.. తర్వాత యూఏఈపై గెలిచింది. అనంతరం అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన పాక్.. తాజాగా యూఏఈతో రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.ఫఖర్ జమాన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్ (16), సయీమ్ ఆయుబ్ (11) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (Fakhar Zaman) అద్భుత అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 44 బంతులు ఎదుర్కొని.. పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫఖర్ జమాన్‌కు తోడుగా మహమ్మద్ నవాజ్ (27 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడాడు. దీంతో పాక్ మెరుగైన స్కోరు సాధించగలిగింది.యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ రెండు వికెట్లు తీయగా.. జునైద్ సిద్దిఖీ, ముహమ్మద్ రోషిద్ ఖాన్, ధ్రువ్ పరాశర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈకి ఆదిలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ ముహమ్మద్ వసీం (19)ను అబ్రార్ అహ్మద్ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపించాడు.అలిశాన్ షరాఫూ అర్ధ శతకం వృథాఅయితే, మరో ఓపెనర్ అలిశాన్ షరాఫూ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. కానీ, పాక్ బౌలర్ల విజృంభణతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో షరాఫూ అర్ధ శతకం వృథాగా పోయింది. ఎథాన్ డిసౌజా (9), ఆసిఫ్ ఖాన్ (7), రాహుల్ చోప్రా (0), హర్షిత్ కౌశిక్ (3), జునైద్ సిద్దిఖీ ఇలా వచ్చి అలా వెళ్లగా.. ధ్రువ్ పరాశర్ (15 బంతుల్లో 18 నాటౌట్), హైదర్ అలీ (12- రనౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి యూఏఈ ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అబ్రార్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగి.. పసికూనను వణికించాడు. ఇక షాహిన్ ఆఫ్రిది, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఫైనల్లో అఫ్గన్‌తో పాక్ ఢీకాగా ఈ ముక్కోణపు సిరీస్‌లో యూఏఈ శుక్రవారం అఫ్గనిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇక ఆదివారం పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ ఫైనల్లో తలపడతాయి. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
పాకిస్తాన్ యువ బౌలర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారశైలిపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని.. అంతేతప్ప అతి చేయకూడదంటూ చీవాట్లు పెట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడింది.దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీయగా.. పేసర్లలో హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నారు.పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిజ్వాన్(46) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లోనే 20 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆదిలో దూకుడుగా ఆడినా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకానికి చేరువైన సమయంలో అనూహ్య రీతిలో గిల్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అయితే, ఆ సమయంలో అబ్రార్ అహ్మద్ కాస్త అతిగా స్పందించాడు. రెండు చేతులు కట్టుకుని నిలబడి.. ‘‘ఇక వెళ్లు’’.. అన్నట్లుగా కళ్లతోనే సైగలు చేయగా సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అతడితో ఆనందం పంచుకున్నారు. అప్పుడు మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కాస్త సంయమనం పాటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. అబ్రార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.‘‘ప్రిన్స్‌తో పెట్టుకున్నందుకు.. కింగ్ మీకు చుక్కలు చూపించాడు. మిమ్మల్ని ఓడించాడు. అందుకే అతి చేయొద్దు’’ అంటూ టీమిండియా అభిమానులు కోహ్లి శతకంతోనే పాక్ జట్టుకు బదులిచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం కూడా స్పందించాడు.‘‘అబ్రార్ బంతి వేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. కానీ అతడి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కానీ.. మ్యాచ్‌లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి పనికిరావు. ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. అయితే, ఈరోజు అబ్రార్ అతి చేశాడు. అతడిని వారించేందుకు అక్కడ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇలాంటి ప్రవర్తన టీవీల్లో చూడటానికి కూడా అస్సలు బాగాలేదు’’ అని వసీం అక్రం అబ్రార్‌కు చురకలు అంటించాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక మెగా వన్డే టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో పాటు గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. -
గిల్‌ను ఔట్ చేశాక పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం, మాటల యుద్దానికి దిగడం సర్వ సాధారణం. అయితే ఇటీవలికాలంలో ఇలాంటి వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. మైదానంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. కోహ్లి, రోహిత్ జమానా మొదలయ్యాక భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో స్లెడ్జింగ్ అనేదే కనిపించడం లేదు. జూనియర్లు సీనియర్లను గౌరవిస్తున్నారు. వీలైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పాక్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి దగ్గర చిట్కాలు తీసుకోవడం చూశాం.Virat Kohli to Abrar Ahmed pic.twitter.com/4BrIhnw6vb— Sagar (@sagarcasm) February 23, 2025అయితే తాజాగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ మంచి సంప్రదాయానికి తూట్లు పొడిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అబ్రార్ చాలా ఓవరాక్షన్ చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. Look at audacity of Abrar 🤬Beta Karachi airport ke liye flight pakdo, hold this elimination ✌🏽 pic.twitter.com/J6c3ax7LDS— 🥹 shim8u (@veerjatt007) February 23, 2025అసలేం జరిగిందంటే.. భారత్, పాకిస్తాన్ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అబ్రార్ అహ్మద్ అతి చేశాడు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్‌ను అబ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్‌ను ఔట్ చేశాక అబ్రార్ ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. Batao, ye Abrar Ahmed ne utne matches nahi khele jitney ki Centuries Gill ki hai, lekin send-off dekho lukkhe ka https://t.co/3C8Sd4TLNz pic.twitter.com/dhtHqbPUPG— Mihir Jha (@MihirkJha) February 23, 2025చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు. దీంతో భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్‌ను సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. బ్యాగ్ సర్దుకోవాల్సింది గిల్ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch it before it get remove Abrar reaction to Gill One word for abrar 👇🏼👇🏼 #indvspak #viratkohli pic.twitter.com/coEQydD2qy— Vodka triceps (@vodkatriceps) February 24, 2025కొందరు గిల్ హార్డ్ కోర్ అభిమానులు వాడకూడని భాషలో అబ్రార్‌ను దూషిస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ది చెప్పే విరాట్ కోహ్లి ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి అబ్రార్ చేసిన ఓవరాక్షన్‌తో పాక్ జట్టు మొత్తం ట్రోలింగ్‌కు గురైంది.మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
విండీస్‌తో టెస్టులకు పాక్ జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను శనివారం వెల్లడించింది. ఇటీవల సౌతాఫ్రికాలో పర్యటించిన టెస్టు జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసి.. ట్విస్ట్ ఇచ్చింది. ఇమామ్-ఉల్- హక్(Imam-ul-Haq) రీఎంట్రీతో పాటు మరెన్నో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది.అబ్దుల్లా షఫీక్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. ఇమామ్‌కు పిలుపునిచ్చారు. కాగా ఇమామ్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 635 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సెంచరీలు(184, 160) ఉన్నాయి. దీంతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇమామ్ ఉల్ హక్కు సెలక్టర్లు పిలుపునివ్వడం గమనార్హం.విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరంఇదిలా ఉంటే.. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) కూడా తిరిగి రాగా.. షాహిన్ ఆఫ్రి(Shaheen Afridi)ది మాత్రం ఈ జట్టులో లేడు. పని భారాన్ని తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. నసీం షా, ఆమిర్ జమాల్, మీర్ హంజాలను కూడా సెలక్టర్లు రెస్ట్ పేరిట పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక ఫామ్‌లో ఉన్న సయీమ్ ఆయుబ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో ఖుర్రం షాజాద్‌తో పాటు మహ్మద్ అలీ, అన్క్యాప్డ్ ప్లేయర్ కశిఫ్ అలీ పేస్‌దళ విభాగంలో చోటు దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో తమ చివరి సిరీస్‌లో పాకిస్తాన్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడుతోంది. ముల్తాన్ వేదికగా జనవరి 17-21 మధ్య తొలి టెస్టు, జనవరి 25-29 మధ్య రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అనంతరం న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో స్వదేశంలో పాకిస్తాన్ త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాన పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షాలకు టెస్టు జట్టు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.సౌతాఫ్రికాలో పరాభవంఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సెంచూరియన్, కేప్‌టౌన్ టెస్టుల్లో ఓడి 2-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైంది. అంతకు ముందు టీ20 సిరీస్‌ను ప్రొటిస్ జట్టుకు చేజార్చుకున్న పాక్.. వన్డే సిరీస్‌ను మాత్రం 3-0తో వైట్‌వాష్ చేసింది. తద్వారా సౌతాఫ్రికా జట్టును తమ సొంతగడ్డపై వన్డేల్లో ఈ మేర క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, కాశిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్ బ్యాటర్), నొమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్ బ్యాటర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
అరంగేట్రంలోనే రికార్డుల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ అరంగేట్రంలోనే (వన్డే) రికార్డుల్లోకెక్కాడు. అబ్రార్ తొలి మ్యాచ్‌లోనే తమ దేశ దిగ్గజ బౌలర్ అబ్దుల్ ఖాదిర్ సరసన చేరాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (రెండో వన్డే) 4 వికెట్లు తీసిన అబ్రార్, అబ్దుల్ ఖాదిర్‌తో పాటు ఎలైట్ గ్రూప్‌లో చేరాడు. 1984లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అబ్దుల్ ఖాదిర్ కూడా తన అరంగేట్రంలో 4 వికెట్లు తీశాడు. పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో ఇవే అత్యధిక వికెట్లు. అబ్దుల్ ఖాదిర్, అబ్రార్ అహ్మద్‌తో పాటు జాకిర్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్ కూడా పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీశారు. కాగా, జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాక్, ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.విజృంభించిన అబ్రార్.. 145 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వేఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. అబ్రార్ అహ్మద్ (8-2-33-4), అఘా సల్మాన్ (7-0-26-3), సైమ్ అయూబ్ (4-0-16-1), ఫైసల్ అక్రమ్ (5.3-0-19-1) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.53 బంతుల్లో శతక్కొటిన సైమ్ అయూబ్146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 18.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో పాక్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ 53 బంతుల్లో శతక్కొట్టాడు. పాక్ తరఫున వన్డేల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ (జాయింట్). ఈ మ్యాచ్‌లో సైమ్ ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ 48 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 28న జరుగనుంది. -
Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. పాక్ క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. పాక్ టెయిలెండర్ అబ్రార్ అహ్మద్ మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన తీరు బంగ్లా శిబిరంలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ అబ్రార్ చర్యకు స్పందించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..తొలి టెస్టులో ఘన విజయంరెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన బంగ్లాదేశ్.. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. పది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి పాక్‌పై టెస్టుల్లో విజయం సాధించింది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌ను మొదలుపెట్టిన పర్యాటక జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసి.. ఆ దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు పాక్‌ను ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే పరిమితం చేసింది.రెండో మ్యాచ్‌లోనూ అదరగొడుతూసోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నషీద్ రాణా నాలుగు వికెట్లతో చెలరేగి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచారు. ఈ క్రమంలో.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్రమంలో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ హడావుడిలో అతడి చేతి గ్లౌజ్ కిందపడగా.. వెంటనే దానిని తీసుకుని మరింత వేగంగా క్రీజు వైపునకు పరిగుతీశాడు.ఆలస్యమైతే అవుటే.. షకీబ్ నవ్వులుఆ సమయంలో బౌలింగ్ చేస్తున్నది మరెవరో కాదు బంగ్లా మాజీ కెప్టెన్ షకీబల్ హసన్. అబ్రార్ హడావుడికి అదే కారణం. ఏమాత్రం ఆలస్యం చేసినా టైమ్డ్ అవుట్ కింద అవుట్ అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన అబ్రార్.. అలా పరిగెత్తగానే.. షకీబల్ నవ్వడం గమనార్హం. కాగా వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో షకీబ్.. టైమ్డ్ అవుట్ కింద అప్పీలు చేసి ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే.నాడు లంక బ్యాటర్‌కు చేదు అనుభవంఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ అవుటైనా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చే ఆటగాడు.. మూడు నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే.. టైమ్డ్ అవుట్ రూల్ కింద అవుటైనట్లుగా ప్రకటిస్తారు. నాడు మాథ్యూస్ షకీబ్ కారణంగా ఇలా అవుటై.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అది దృష్టిలో పెట్టుకునే అబ్రార్ కూడా షకీబ్‌కు భయపడి ఉంటాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: 'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'unreal fear of abrar ahmed being get timed out when Shakib is bowling 😂Everyone remembered what happened with sir angelo Mathews 😜#PAKvBAN pic.twitter.com/bXiijoNBKb— Afrid Mahmud Rifat 🇧🇩 (@rifat0015) September 2, 2024 -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
బంగ్లాతో తొలి టెస్టు.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్-‘ఎ’ టీమ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాక్- బంగ్లా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది.ఈ రెండు టెస్టులు ఎందుకు కీలకం?రావల్పిండి వేదికగా ఆగష్టు 21- 25, కరాచీ వేదికగా ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలంటే సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ పాక్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఈ నేపథ్యంలో తమ వ్యూహాల్లో భాగంగా బంగ్లాతో తొలి టెస్టులో కేవలం పేసర్లకు మాత్రమే తుదిజట్టులో చోటివ్వనుంది. ఈ క్రమంలో యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. పాకిస్తాన్ షాహిన్స్- బంగ్లాదేశ్-‘ఎ’ మధ్య ఆగష్టు 20న కరాచిలో మొదలుకానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది.అందుకే అతడిని రిలీజ్ చేశాంతద్వారా అతడికి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. ప్రధాన సిరీస్ తొలి టెస్టులో బెంచ్‌కే పరిమితం చేసే బదులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అబ్రార్ అహ్మద్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులాంను రిలీజ్ చేశామని.. అతడు కూడా పాకిస్తాన్ షాహిన్స్ జట్టుతో చేరనున్నట్లు తెలిపింది.అంతేకాదు.. అతడే పాకిస్తాన్ షాహిన్స్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని పీసీబీ పేర్కొంది. అయితే, అబ్రార్, కమ్రాన్ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ ప్రధాన జట్టుతో చేరతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. మీర్ హంజా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, నసీం షా, సయీమ్ ఆయుబ్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ తదితరులు పాకిస్తాన్ షాహిన్స్(తొలి మ్యాచ్ తర్వాత)ను వీడి ఇప్పటికే బంగ్లాతో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు.కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ టేబుల్లో టాప్-2లో నిలిచిన జట్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ ఆయుబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, ఖుర్రమ్ షెహజాద్, షాహిన్ అఫ్రిది.బంగ్లాదేశ్- ‘ఎ’ జట్టు(రెండో మ్యాచ్)తో పోటీపడే పాకిస్తాన్ షాహిన్స్ టీమ్కమ్రాన్ గులాం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అలీ జర్యాబ్, గులాం ముదస్సర్, ఇమామ్ ఉల్ హక్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ అవైస్ అన్వర్, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాద్ బేగ్ (వికెట్ కీపర్), సాద్ ఖాన్, షరూన్ సిరాజ్, ఉమర్ అమీన్. -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తు అయిన పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అహ్మద్ గాయపడ్డాడు. అయినప్పటికి అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు పాకిస్తాన్ జట్టు మేనెజ్మెంట్ తీసుకు వెళ్లింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అహ్మద్ ఆడలేదు. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలో కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అహ్మద్‌కు చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు కూడా అతడు దూరం కావడం దాదాపు ఖాయమైంది. కాగా అతడి స్ధానాన్ని ఇక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో తలపడనుంది. జనవరి 12న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్-కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్ మరియు జమాన్ ఖాన్. చదవండి: #Shweta Sehrawat: 242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్? -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్పిన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ గాయం కారణంగా పెర్త్ వేదికగా జరగనున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. కాగా కాన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అబ్రార్ అహ్మద్‌కు మోకాలి గాయమైంది. బంతిని ఆపే క్రమంలో అతడు గాయపడ్డాడు. నొప్పితో విల్లావిల్లాడిన అహ్మద్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పీసీబీ ఆదివారం దృవీకరించింది. ఇక అతడి స్ధానాన్ని ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్‌తో పాకిస్తాన్ క్రికెట్ భర్తీ చేసింది. సాజిద్ ఖాన్ ఒకట్రెండు రోజుల్లో ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా ఆసీస్-పాకిస్తాన్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి మ్యాచ్. చదవండి: U19 Asia Cup 2023: చేతులెత్తేసిన బౌలర్లు.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి -
నిప్పులు చెరిగిన నసీం షా.. తిప్పేసిన అబ్రార్.. కుప్పకూలిన శ్రీలంక
కొలొంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జులై 24) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. పేసర్లు నసీం షా (3/41), షాహీన్ అఫ్రిది (1/44) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4/69) మాయాజాలం చేయడంలో పాక్ శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూల్చింది. పాక్ ఆటగాడు మసూద్ అద్భుతంగా ఫీల్డింగ్ చేయడంతో ఇద్దరు లంక బ్యాటర్లు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఓపెనర్ నిషాన్ మధుష్క (4), ప్రభాత్ జయసూర్యలను (1) మసూద్ రనౌట్ చేశాడు. పాక్ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ధనంజయ డిసిల్వ (57) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఇతనితో పాటు కెప్టెన్ దిముత్ కరుణరత్నే (17), దినేశ్ చండీమల్ (34), రమేశ్ మెండిస్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సౌద్ షకీల్ (208 నాటౌట్, 30) చెలరేగిపోవడంతో పాక్ 4 వికెట్ల తేడాతో గెలపొందింది. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగా.. సౌద్ షకీల్ రెచ్చిపోవడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైతే.. పాక్ 6 వికెట్లు కోల్పోయి లంక నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇమామ్ ఉల్ హాక్ (50 నాటౌట్).. సౌద్ షకీల్ సాయంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
Pak Vs Eng: గూగ్లీతో స్టోక్స్ మతి పోగొట్టాడు! ‘వరుసగా’ 7 వికెట్లు.. వైరల్
Pakistan vs England, 2nd Test- Abrar Ahmed: పాకిస్తాన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అరంగేట్రంలోనే వరుసగా ఏడు వికెట్లు పడగొట్టి క్రీడా వర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు ఈ యువ లెగ్ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే అతడే! ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే దెబ్బకొట్టాడు అబ్రార్. ఓపెనర్ జాక్ క్రాలేను 19 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఆ తర్వాత బెన్ డకెట్(63), ఓలీ పోప్(60) పట్టుదలగా నిలబడ్డారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న వీరిని అవుట్ చేయడం అబ్రార్‌కు సాధ్యమైంది. డకెట్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఈ యువ స్పిన్నర్.. పోప్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఏడు వికెట్లు ఆ తర్వాత జో రూట్(8), హ్యారీ బ్రూక్ (9), కెప్టెన్ బెన్ స్టోక్స్(30) వికెట్లు కూల్చాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో అబ్రార్ ఖాతాలో ఆఖరి వికెట్ విల్ జాక్స్(31). ఇలా మొత్తంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అబ్రార్ ఏడు వికెట్లు కూల్చగా.. అందులో మూడు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి. అవాక్కైన స్టోక్స్ అయితే, వీటన్నింటిలో స్టోక్స్‌ను అబ్రార్ అవుట్ చేసిన విధానం ప్రత్యేంగా నిలిచింది. 43వ ఓవర్ రెండో బంతికి అద్భుతమైన గూగ్లీతో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. అబ్రార్ సంధించిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో స్టోక్స్ ముందుకు రాగా.. అతడి ప్రయత్నం ఫలించలేదు. బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో అవాక్కవడం స్టోక్స్ వంతైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. 24 ఏళ్ల అబ్రార్ అహ్మద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లకు పగలే చుక్కలు చూపించావు.. ఇప్పుడే మొదలైన నీ ప్రయాణం మరింత గొప్పగా ముందుకు సాగాలి’’ అని క్రికెట్ ఫ్యాన్స్ అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా అబ్రార్ (144/7) సంచలన బౌలింగ్‌తో మెరవగా, జాహిద్ మహ్మద్ 3 వికెట్లు కూల్చాడు. దీంతో.. 51.4 ఓవర్లలో 281 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు! FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి This. Is. Special. 🤯#PAKvENG | #UKSePK pic.twitter.com/ExgHlMfrxY — Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022 -
పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు..
అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ యువ బౌలర్ మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టుకు వణుకుపుట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్ అహ్మద్ సాధించాడు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా అబ్రార్ అహ్మద్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక అబ్రార్ అహ్మద్ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్‌తో పాటు జహీద్ మహ్మద్ కూడా మూడు వికెట్లు సాధించాడు. కాగా మొత్తం పది వికెట్లను కూడా స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. కాగా ఇంగ్లండ్ బ్యాటర్లలో డాకెట్ (63), ఓలీ పాప్(60) పరుగులతో రాణించారు. ఇక ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్ అహ్మద్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తొలి పాక్ బౌలర్‌గా టెస్టు అరంగేట్రం తొలి సెషన్లోనే ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర టెస్టులో తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్ బౌలర్‌గా అహ్మద్ నిలిచాడు. అంతకుముందు పాక్ పేసర్ వహబ్ రియాజ్ తన డెబ్యూ టెస్టు మొదటి రోజులో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించిన 13వ పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. First morning as a Test debutant 🌟 Abrar Ahmed becomes the 13th Pakistan bowler to take a five-wicket haul on Test debut 💫#PAKvENG | #UKSePK pic.twitter.com/OE1qqtkPsN — Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022 చదవండి: Ind Vs Ban 3rd ODI: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్