
అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్‌తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది.

ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ బ్యాటింగ్ యువ కెరటం లూసీ లైల్స్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్‌గా కనిపించారు. లూసీతో ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని బ్రూక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.
లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్ ప్రస్తుతం ఎలాంటి కమిట్‌మెంట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్ 18 నుంచి ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.
అబ్రార్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్ స్పిన్నర్ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వీ సహా పలువురు పాక్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్-2025లో నఖ్వీకి, పాక్ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్ రిసెప్షన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ పాక్‌ను ఫైనల్ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు.
భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్‌ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది.
చదవండి: స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!