ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు..

అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ యువ బౌలర్ మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టుకు వణుకుపుట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్ అహ్మద్ సాధించాడు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా అబ్రార్ అహ్మద్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అబ్రార్ అహ్మద్ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్‌తో పాటు జహీద్ మహ్మద్ కూడా మూడు వికెట్లు సాధించాడు. కాగా మొత్తం పది వికెట్లను కూడా స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. కాగా ఇంగ్లండ్ బ్యాటర్లలో డాకెట్ (63), ఓలీ పాప్(60) పరుగులతో రాణించారు. ఇక ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్ అహ్మద్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి పాక్ బౌలర్‌గా
టెస్టు అరంగేట్రం తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర టెస్టులో తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్ బౌలర్‌గా అహ్మద్ నిలిచాడు. అంతకుముందు పాక్ పేసర్ వహబ్ రియాజ్ తన డెబ్యూ టెస్టు మొదటి రోజులో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించిన 13వ పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
First morning as a Test debutant 🌟
Abrar Ahmed becomes the 13th Pakistan bowler to take a five-wicket haul on Test debut 💫#PAKvENG | #UKSePK pic.twitter.com/OE1qqtkPsN
— Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022
చదవండి: Ind Vs Ban 3rd ODI: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు