ఫైసలాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో జరిగిన ఐదు వన్డే సిరీస్‌లలో పాక్‌కు ఇది నాలుగో విజయం.
అబ్రార్ మ్యాజిక్..
ఇక నిర్ణయాత్మక వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 37.5 ఓవర్లలో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అహ్మద్ తన పది ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కెప్టెన్ షాహీన్ అఫ్రిది, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
ప్రోటీస్ బ్యాటర్లలో ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (72), ప్రిటోరియస్ (57) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.1 ఓవర్లలో చేధించింది. పాక్ ఓపెనర్ సైమ్ అయూబ్(77) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.
చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం


