పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఓవర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షాహీన్ చరిత్ర సృష్టించాడు. ఈ స్పీడ్ స్టార్ ఇప్పటివరకు టీ20ల్లో తొలి ఓవర్‌లో మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు.
లహోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో మొదటి ఓవర్‌లో డికాక్, ప్రిటోరియస్‌ను ఔట్ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతుకుముందు ఈ రికార్డు ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ పేరిట ఉండేది. బిలాల్ మొదటి ఓవర్‌లో 22 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బిలాల్‌ను అఫ్రిది అధిగమించాడు.
కాగా ఈ సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో టాస్ గెలిచి పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అఫ్రిది మొదటి ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టి పాక్‌కు శుభారంభం అందించాడు. అతడితో పాటు స్పిన్నర్లు ఉస్మాన్ తరీఖ్, నవాజ్ తలా వికెట్ సాధించారు. దీంతో ప్రోటీస్ 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు మాత్రమే చేసింది.
తుది జట్లు
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం, సల్మాన్ అఘా(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ బ్రీట్జ్కే, డోనోవన్ ఫెరీరా(కెప్టెన్), జార్జ్ లిండే, కార్బిన్ బాష్, ఆండిల్ సిమెలన్, లిజాడ్ విలియమ్స్, ఒట్నీల్ బార్ట్‌మన్


