breaking news
Allah Ghazanfar
-
ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ (AM Ghazanfar) త్వరలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) దూరమయ్యాడు. 18 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ అయిన ఖరోటే ముందుగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో (ఛాంపియన్స్ ట్రోఫీ) ట్రావెలింగ్ రిజార్వ్గా ఉన్నాడు. 20 ఏళ్ల ఖరోటే ఆఫ్ఘనిస్తాన్ తరఫున 7 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ విషయానికొస్తే.. ఈ మిస్టరీ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 11 వన్డేల్లో 21 వికెట్లు.. ఓ టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ లేని లోటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం ఫిబ్రవరి 21న ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుంది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు..ఫిబ్రవరి 21న సౌతాఫ్రికాతోఫిబ్రవరి 26న ఇంగ్లండ్తోఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో -
అప్పుడేమో రూ.20 లక్షలు.. కట్ చేస్తే! ఇప్పుడు ఏకంగా 4.8 కోట్లు
ఐపీఎల్-2025లో అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్కు జాక్ పాట్ తగిలింది. ఈ మిస్టర్ స్పిన్నర్‌ను ఏకంగా రూ. 4.8 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఘజన్ఫర్ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ బిడ్ వేసింది. తర్వాత పోటీలోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఆఖరికి ఆర్సీబీ, కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ అఫ్గానీ ముంబై సొంతమయ్యాడు.అప్పుడేమో రూ. 20 లక్షలు..కాగా ఐపీఎల్-2024లో ఘజన్ఫర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ గాయం కారణంగా సీజన్ మధ్యలో తప్పుకోవడంతో కేకేఆర్ ఘజన్‌ఫర్‌ను జట్టులోకి తీసుకుంది. రూ. 20లక్షల కనీస ధరకు అతడితో కేకేఆర్ ఒప్పందం కుదుర్చుకుంది.కానీ ఘజన్ఫర్కు కేకేఆర్ తరపున ఆడే అవకాశం మాత్రం రాలేదు. కాగా గత సీజన్లో కేవలం రూ. 20లక్షలు మాత్రమే తీసుకున్న ఘజన్ ఫర్ దశ ఐపీఎల్-2025 వేలంతో మారిపోయింది. గతంలో అతడు తీసుకున్న మొత్తంతో పోలిస్తే ఈసారి తనకు దక్కనున్నది రూ. 4.6 కోట్లు అదనం కావడం గమనార్హం.వైట్‌బాల్ క్రికెట్లో అదుర్స్..కాగా ఘజన్ఫర్ ఈ ఏడాది ఆరంభంలో వన్డే ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన చేఆడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అదే విధంగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో కూడా ఘజన్ఫర్ అదరగొట్టాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు ఆరు వికెట్లు తీశాడు. మొత్తంగా 16 టీ20లు ఆడిన ఘజన్ఫర్.. 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో 29 వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్‌లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్‌గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా ఘజన్‌ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్‌లో అఫ్గాన్‌తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్‌ఫన్.. షకీబ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024