WPL Eliminator: దంచికొట్టిన బెత్‌ మూనీ | WPL 2026 Eliminator GGTW vs DCW: Mooney Fifty Check Gujarat Score | Sakshi
Sakshi News home page

WPL Eliminator: దంచికొట్టిన బెత్‌ మూనీ.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?

Feb 3 2026 9:26 PM | Updated on Feb 4 2026 5:16 PM

WPL 2026 Eliminator GGTW vs DCW: Mooney Fifty Check Gujarat Score

బెత్‌మూనీ (PC: IANS)

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఫైనల్‌ చేరగా.. మరో బెర్తు కోసం గుజరాత్‌ జెయింట్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోటీ నెలకొంది.

దంచికొట్టిన బెత్‌ మూనీ
ఇందులో భాగంగావడోదరలోని  కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. గుజరాత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ అజేయ అర్ధ శతకం (51 బంతుల్లో 62) మెరవగా.. మరో ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (6), వన్‌డౌన్‌ బ్యాటర్‌ అనుష్క శర్మ (16) నిరాశపరిచారు.

ఇక కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌, భారతి ఫల్మలి డకౌట్‌గా వెనుదిరగగా.. కనిక అహుజా సైతం 6 పరుగులకే అవుటైంది. జార్జియా వారేహమ్‌ (25 బంతుల్లో 35), కశ్వీ గౌతం (10 బంతుల్లో 18) మెరుగ్గా రాణించారు. ఫలితంగా గుజరాత్‌ 150 పరుగుల మార్కు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

ఢిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. నందాని శర్మ రెండు, మిన్ను మణి ఒక వికెట్‌ పడగొట్టారు. గుజరాత్‌ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది.

డబ్ల్యూపీఎల్‌-2026 ఎలిమినేటర్‌ మ్యాచ్‌ గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ
తుదిజట్లు
గుజరాత్‌
బెత్‌ మూనీ (వికెట్‌ కీపర్‌), సోఫీ డివైన్‌, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్‌నర్‌ (కెప్టెన్‌), జార్జియా వరేహమ్‌, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌.

ఢిల్లీ
లిజెల్లి లీ (వికెట్‌ కీపర్‌), షఫాలి వర్మ, లారా వల్వర్ట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ (కెప్టెన్‌), మరిజానే కాప్‌, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్‌, స్నేహ్‌ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ.
 

Advertisement
 
Advertisement
Advertisement