టీ20 ప్రపంచకప్ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్‌కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్‌లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.
అసలంకపై వేటు..
కాగా ఈ మెగా టోర్నీ కోసం లంక సెలెక్టర్లు గత డిసెంబర్‌లో 25 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
షనక కెప్టెన్‌గా గతంలో లంకకు ఆసియాకప్‌ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతున్నారు.
టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ


