భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం ఆదివారం(నవంబర్ 23) ఇండోర్‌లో జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో మంధాన-ముచ్చల్ జంట డ్యాన్స్‌తో అదరగొట్టారు.
తొలుత పలాష్ మెడలో స్మృతి దండ వేయగా.. అతడు స్టార్ ఓపెనింగ్ బ్యాటర్‌కు వినయంగా వంగి నమస్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి 'తేను లేకే మైన్ జావంగా' వంటి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా ఈ కార్యక్రమానికి స్మృతి సహచర క్రికెటర్లు హాజరై సందడి చేశారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. వారి వివాహ వేడుకల్లో భాగంగా, 'టీమ్ బ్రైడ్' (వధువు జట్టు), 'టీమ్ గ్రూమ్' (వరుడి జట్టు) మధ్య ఒక సరదా క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది.
స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన 'టీమ్ బ్రైడ్' ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు శుక్రవారం జరిగిన స్మృతి హల్దీ వేడుకలో భారత మహిళా క్రికెటర్లు తమ ఆటపాటలతో అలరించారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలే పలాశ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అనంతరం తన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్మృతి అభిమానులతో పంచుకుంది.
చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన
oh my god smriti's girl gang performed for her 🥹💕 pic.twitter.com/1MzVGpycCD
— IWCT WORLD CHAMPIONS🎊 (@mandyyc0re) November 22, 2025
Smriti Mandhana and Palash muchhal dancing together ❤️ pic.twitter.com/cIFvv3WkCl
— JosD92 (@JosD92official) November 22, 2025


