గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. రెండో రోజు ఆటలో ప్రోటీస్ లోయర్-ఆర్డర్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు.
ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెనురన్ ముత్తుసామి(203 బంతుల్లో 107 బ్యాటింగ్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ముత్తుసామికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 247/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్‌లో పట్టు బిగించింది. ముత్తుసామి, కైల్ వెర్రెయెన్నె (45) నిలకడగా ఆడి స్కోర్‌ను 300 పరుగులు దాటించారు.
టీ బ్రేక్ తర్వాత కైల్ వెర్రెయెన్నె పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మార్కో జాన్సెన్ (51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 ) దూకుడుగా ఆడి మూడో టెస్టు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జాన్సెన్ భారత స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అతడిని ఆపేందుకు బుమ్రాను ఎటాక్‌లోకి తీసుకొచ్చినప్పటి ఫలితం మాత్రం దక్కలేదు. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ సాధించాడు. పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారింది.
చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్


